అనసూయ ఇంట్లో అధికారులు

May 26, 2020

ఏడాదికి 40 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు అది కూడా వ్యాపారాత్మక కార్యక్రమాల ద్వారా అని అనుమానం వచ్చిన ప్రముఖు వ్యక్తులు, సంస్థలు, దుకాణాలపై జీఎస్టీ విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. వాస్తవానికి 20 లక్షల రెవెన్యూ దాటితే కొన్ని వ్యాపారాలకు, 40 లక్షల రెవెన్యూ దాటితే అన్ని వ్యాపారాలకు జీఎస్టీ వర్తిస్తుంది. కానీ చాలా మంది దీనిని పరిగణలోకి తీసుకోకుండా జీఎస్టీని ఎగ్గొడుతున్నారు. కొందరు కొంత మేర ఎగ్గొడుతుంటే... ఇంకొందరు పూర్తిగా ఎగ్గొడుతున్నారు. ఇటీవల జీఎస్టీ వసూలు తగ్గడం, జీఎస్టీ వసూలు సరిగా లేదని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అధికారులు ఈ ప్రత్యేక రైడ్ నిర్వహించారు. 

దేశ వ్యాప్తంగా జీఎస్టీ అమలవుతోంది. నోట్ల రద్దు తర్వాత మోడీ తీసుకున్న అతిపెద్ద నిర్ణయాల్లో ఇదొకటి. జీఎస్టీ చాలా సంక్లిష్టంగా ఉండటంతో అనేక దశల్లో ఇందులో మార్పులు చేశారు. ఆ మార్పులు చేసే క్రమంలో జీఎస్టీ చిరు వ్యాపారులకు మినహాయింపు ఇచ్చారు. 40 లక్షల వరకు రెవెన్యూ ఉంటే జీఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. డబ్బును ఏ రూపంలో తీసుకున్నా జీఎస్టీ వర్తిస్తుంది. అయితే... ప్రముఖులు డబ్బును క్యాష్ రూపంలో తీసుకుంటున్నారు. టోకున కమిషన్లు వసూలు చేసేవారు, కన్సల్టెంటు కూడా నగదు రూపంలో తీసుకుని జీఎస్టీ కట్టడం లేదు. అలాంటి వారిని సులువుగానే గుర్తుపట్టవచ్చు. అందుకే ఈరోజు నగరంలో 23 మందిని ఎంపిక చేసుకుని అధికారులు దాడులు చేశారు. వారిలో నటులు అనసూయ, లావణ్య త్రిపాఠి కూడా ఉన్నారు.