మరో గ్యాంగ్ వార్ ... ఈసారి గుంటూరులో !!

August 11, 2020

విజయవాడలో మొన్న జరిగిన గ్యాంగ్ వార్ ముగియకముందే... మరో ఘోరం జరిగింది. ఈసారి పక్కనున్న గుంటూరులో ఈ ఘోరం జరిగింది. ఈరోజు గుంటూరులో జరిగిన గ్యాంగ్ వార్ ఏపీలో కలకలం రేపింది. మొన్నటి గ్యాంగ్ వార్ ఆస్తి కోసం జరిగితే నేటి గ్యాంగ్ వార్ ఒక అమ్మాయి కోసం జరిగినట్టు చెబుతున్నారు. ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కాలేదు.

ఓ యువతి విషయంలో రెండు వేర్వేరు వర్గాలకు చెందిన యువకుల మధ్య గొడవ మొదలైంది. అచ్చం విజయవాడ ఘటనలాగే రాత్రికి  గ్రౌండ్ లో తేల్చుకుందాం అని సవాళ్లు విసురుకున్నారు. ఈ సవాళ్లతోనే గ్యాంగ్ వార్ మొదలైంది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఇరు వైపుల వారు బాహాబహికి దిగారు.  

ఈ వ్యవహారం గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అరుండల్ పేట పోలీసులు హుటాహుటిన గ్రౌండ్ కి చేరుకున్నారు. పోలీసులు మెరుపుదాడిలో చాలా మంది చిక్కారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. వీరంతా ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల స్టూడెంట్స్ అని తెలుస్తోంది. అందరూ బీటెక్ విద్యార్తులే. దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ తాజా వ్యవహారానికి విజయవాడ పటమటలో జరిగిన గ్యాంగ్ వారే స్ఫూర్తి అన్నట్టు తెలుస్తోంది. విజయవాడలో ఓ స్థల వివాదంలో రెండు వర్గాల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ లో సందీప్ అనే యువకుడు చనిపోయిన విషయం తెలిసిందే.