ఏపీకి వస్తున్నారా - కొత్త రూల్ తెలుసుకోండి

July 12, 2020

నల్లగొండ జిల్లా మీదుగా ఆంధ్రప్రదేశ్ వెళ్లాలనే ప్రయాణికులకు ఏపీ సర్కారు ఆంక్షలు విధించారు. నల్గొండ- గుంటూరు జిల్లాల మధ్య వాడపల్లి సరిహద్దు ప్రాంతం. విజయవాడ హైవే కాకుండా ఈ రూటు ద్వారా గుంటూరు, ఒంగోలు, నెల్లూరు వాహనాలు ఏపీలో ప్రవేశిస్తాయి. అయితే ఈ సరిహద్దు వద్ద ఏపీ సర్కారు ఆంక్షలు విధించింది.

 ఇకపై ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 7.00 వరకు మాత్రమే సరిహద్దు వద్ద వాహనాల అనుమతించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా నల్లగొండ నుంచి ఏ.పి.లోకి వెళ్లే అన్ని వాహనాలను సాయంత్రం 7.00 తర్వాత ఆంధ్రా సరిహద్దులలో నిలిపివేస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రయాణికులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుని ప్రయాణించాలని రంగనాధ్ కోరారు. 

7.00 గంటల తర్వాత ఆంధ్రా సరిహద్దులకు వచ్చి ప్రయాణికులు ఇబ్బందులు పడవద్దని ఆయన సూచించారు. ఇక ఇదే సమయంలో నల్లగొండ జిల్లా మీదుగా మాచర్లకు వెళ్లే మార్గంలో ఉన్న నాగార్జున సాగర్ - మాచర్ల రోడ్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రోడ్డుగా గుర్తించనందున ఆ మార్గంలో ఎలాంటి ప్రజా రవాణా, వాహనాలను ఏ.పి. పోలీసులు అనుమతించడం లేదని ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు. అంటే ఈ రోడ్డును పూర్తిగా మూసివేశారు.

Read Also

అచ్చెన్న ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది?
జగన్ రంగుల కల కరిగిపోయిన విధంబెట్టిదనిన
బెజవాడలో స్పా పేరిట ‘‘ఆ‘‘ వ్యవహారం గుట్టుగా !