అమెరికాలో గుంటూరు ఎన్నారైల స‌మావేశం

August 07, 2020

వాషింగ్ ట‌న్ డీసీలోని వాల్ట‌న్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో గుంటూరు ఎన్నారైల ఆత్మీయ స‌మావేశం జ‌రిగింది. గుంటూరు ఎన్నారై అస్సోసియేష‌న్ వ్య‌వ‌స్థాప‌క స‌భ్యులు శ్రీ‌నివాస‌రావు కొమ్మినేని, ముర‌ళి వెన్నం, రాంచౌద‌రి ఉప్పుటూరి ఈ సంస్థ ఇప్ప‌టివ‌ర‌కు చేపట్టిన సేవా కార్య‌క్ర‌మాలు, ఇక ముందు చేప‌ట్ట‌బోయే కార్య‌క్ర‌మాల గురించి వివ‌రించారు.

ఈ కార్యక్ర‌మానికి ముఖ్య అతిధిగా కెన‌డా ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్చ్ మంత్రి, గుంటూరు జిల్లా సంగం జాగ‌ర్ల‌మూడికి చెందిన ప్ర‌సాద్ పాండా పాల్గొన్నారు. ప్ర‌సాద్ మాట్లాడుతూ గుంటురు జిల్లా విద్యా, వైద్య, వ్యాపార రంగాల‌లో ముందు ఉంద‌న్నారు. గుంటూరు ప్రాంత వాసులు ఎక్క‌డ నివ‌సిస్తున్నా.. స్థిర‌ప‌డిన ప్రాంత అభివృద్దికి మ‌రియు మూతృదేశాభివృద్ధికి కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో రాజ‌కీయ ప్ర‌యుఖులు మాజీ మంత్రి న‌క్క ఆనంద‌బాబు, ఎమ్మెల్యే కృష్ణ ప్ర‌సాద్‌, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మ‌న్ మ‌న్న వ‌సుబ్బారావు, శుక‌వాసి శ్రీ‌నివాస్‌, తానా మాజీ అధ్య‌క్షులు నాదెళ్ల గంగాధ‌ర్‌, జ‌య‌రామ్ కోమ‌టి, హేమ ప్ర‌సాద్‌, ప్ర‌స్తుత తానా అధ్య‌క్షులు జ‌య శంక‌ర్ తాళ్లూరి, టీడీ ఫైవ్ యుస్ చైర్మ‌న్ శ్రీ‌ధ‌ర్ చిల్ల‌ర‌, మిమిక్రీ ర‌మేష్‌, యాంక‌ర్ మ‌ధుని ప్ర‌సంగించాక స‌త్క‌రించారు.

ఈ కార్యక్ర‌మానికి శ్రీ‌నివాస‌రావు కొమ్మినేని, ముర‌ళి వెన్నం, రాంచౌద‌రి ఉప్పుటూరి. ఫ‌ణి బాబు ఉప్ప‌ల, చ‌ల‌ప‌తి కొండ్ర‌గుంట‌, బుల్ల‌య్య ఉన్న‌వ‌, చిన్న‌పురెడ్డి అల్లం స‌హ‌కారాన్ని అందించారు.