ఎస్ అతడితో డేటింగ్ లో ఉన్నా !

August 13, 2020

వ్యక్తిగత విషయాల మీద కెమేరా ముందు మాట్లాడటానికి సెలబ్రిటీలు ఇష్టపడరు. అందులోనూ.. ఫలానా వ్యక్తితో రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చిన వేళ.. ఆ విషయాల మీద క్లారిటీ ఇచ్చేందుకు సుతారమూ నో అనేస్తారు. అందుకు భిన్నంగా.. తమ మధ్యనున్న రిలేషన్ గురించి ఓపెన్ అయిపోయారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల. రెండేళ్లుగా ఆటకు దూరమైనా.. అకాడమీ పెట్టి అందులోనే తన సమయాన్ని గడుపుతూ.. భావి క్రీడాకారుల్ని తయారు చేసే పనిలో నిమగ్నమైంది.
ఇలాంటివేళ.. తమిళ నటుడు విష్ణు విశాల్ తో ఆమె రిలేషన్ స్టార్ట్ అయ్యిందని.. వారిద్దరి మధ్య అనుబంధం అంతకంతకూ ముదురుతోందని.. పెళ్లి దిశగా అడుగులు పడుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. వీటి మీద గుత్తా స్పందించలేదు. అలానే ఖండించనూ లేదు. సోషల్ మీడియాలో విష్ణు విశాల్ మీద తనకున్న అభిమానాన్ని.. తమ రిలేషన్ అద్దం పట్టేలా కొన్ని పోస్టులు పెడుతోంది.
తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించిన ఆమె.. తన వ్యక్తిగత విషయాల మీదా ఓపెన్ అయ్యింది. తమిళ నటుడితో తమ రిలేషన్ మాట నిజమేనని.. తామిద్దరం డేటింగ్ లో ఉన్నట్లు ఒప్పుకున్నారు గుత్తా జ్వాల. అయితే.. పెళ్లి ఎప్పుడు చేసుకోవాలన్న విషయాన్ని తామిద్దరం ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. త్వరలోనే ఒక్కటి అవుతామన్న ఆమె.. ఆ సందర్భంగా అందరిని ఆహ్వానిస్తామని చెప్పటం ద్వారా.. తన రెండో పెళ్లి వేడుకకగానే ఉంటుంది తప్పించి.. గుట్టుచప్పుడు కాకుండా మాత్రం కాదన్న విషయాన్ని తేల్చేసినట్లుగా చెప్పాలి.