ఎన్నారైల‌పై పిడుగు ప‌డ‌టం ఖాయమేనా?

August 06, 2020
CTYPE html>
 
అమెరికాలో చాలా మంది విదేశీయులు ఉన్నారు. కానీ భార‌తీయ‌లు, ముఖ్యంగా అక్క‌డి ఐటీ ఉద్యోగాల‌పై ఆధార‌ప‌డిన భార‌తీయులు ఎక్కువ‌. అయితే, ఇంటిలో ఒక‌రు ప‌నిచేస్తే అక్క‌డి ఖ‌ర్చులను త‌ట్టుకోవ‌డం సాధ్యం కాదు. అందుకే అక్క‌డ వారిలో భార్య‌భ‌ర్త‌లు ఇద్ద‌రు ప‌నిచేస్తుంటారు. అయితే, అమెరికాలో ఉద్యోగం చేస్తున్న హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు పని చేసే అనుమతిని ర‌ద్దు చేయాల‌ని ట్రంప్ ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది. ఈ మేర‌కు  తయారుచేసిన ప్రతిపాదనలు అధ్య‌క్షుడు ట్రంప్ వ‌ద్ద‌కు చేరాయి. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ.. వైట్‌ హౌస్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫీస్‌లో ప్ర‌స్తుతం ఇవి ప‌రిశీలనో ఉన్నాయి. ఈ ప్ర‌తిపాద‌న‌లు చ‌ట్టంగా మార‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. కానీ చ‌ట్టంగా మార‌డం అయితే ఖాయం అంటున్నారు.
శ్వేతసౌధం ఆమోదించిందంటే... ఇక మ‌న వాళ్ల‌పై పిడుగే. ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తే న‌ష్ట‌పోయేది మ‌నోళ్లే ఎక్కువ‌. ఆ ర‌క‌మైన బాధితులు ఎక్కువ‌గా మ‌న‌వాళ్లే ఉన్నారు. హెచ్‌-1బీ వీసా ఉన్న వారి భాగస్వాములు, గ్రీన్‌కార్డు వెయిటింగ్ లో ఉన్న‌వారి భాగ‌స్వాములు అమెరికా కంపెనీల్లో పనిచేసే అనుమ‌తి 2015లో ఒబామా ప్రభుత్వం కల్పించింది. కేవ‌లం నాలుగేళ్ల‌లోనే దాన్ని అమెరికా వెన‌క్కు లాగేసుకుంటోంది. ఎన్నారైల‌తో పాటు ఇత‌రు దేశాల నుంచి వ‌చ్చిన వ‌ల‌స‌దారులు కూడా వ్య‌తిరేకిస్తున్నారు. అయినా ట్రంప్ వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. 90 వేల మంది భార‌తీయ బాధితులే ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈ చ‌ట్టం కనుక అమ‌ల‌యితే... ఇండియాకు ఎన్నారైలు పంపించే డ‌బ్బులు భారీగా త‌గ్గిపోతాయి.