కొంపముంచుతున్న మహా నగరాలు !

August 14, 2020

మహానగరాలు... మనకు అవకాశాలనే కాదు, కష్టాలను కూడా సృష్టిస్తాయి. .మనది కాని మహాసముద్రమే నగరమంటే. అన్ని వీధులు తెలుసు... కానీ మనుషులే ఎవరూ పరిచయం ఉండదు. కానీ జీవితం అలా గడిచిపోతుంటుంది. వచ్చిన ప్రతిఒక్కరిని అక్కున చేర్చుకుని ఏదో ఒక పని చూపెడతాయి ఈ మహానగరాలు. 

అలాంటి మహానగరాలకే ఈ కరోనా విపత్తు ఎక్కువగా ఉంది. సర్వ జన సమ్మేళనంలా ఉండే ఈ మహానగరాల్లో ఎవరు ఎక్కడి వారో ఎక్కడి నుంచి వచ్చారో తెలియని పరిస్థితి. మనం అనుపానులు అడగలేం. మనకు కావల్సిన పని చూసుకోవడం పోవడం అంతే. ప్రపంచానికి వాణిజ్యనగరంలా నిలుస్తున్న న్యూయార్క్ నగరం పరిస్థితి చూశాం కదా. శవాలు లెక్కపెట్టడం తప్ప చేసేదేమీ లేదు. నిరంతరం మరణమృదంగం మోగుతోంది. ప్రపంచంలో కరోనాకు అత్యధికంగా ప్రభావితం అవుతున్న నగరం న్యూయార్కే. 

మన దేశంలో కూడా వాణిజ్య నగరమైన ముంబై కరోనా కేసులకు ఆలవాలంగా మారింది. దేశంలో అత్యధిక కేసులు అక్కడివే.  500 కేసుల కంటే ఎక్కువ కేసులున్న నగరాలు మనదేశంలో ఆరు ఉన్నాయి. 

ముంబై - 3029 కేసులు

ఢిల్లీ - 2081 కేసులు

అహ్మదాబాద్ - 1298 కేసులు

ఇండోర్ - 915 కేసులు

పుణె - 660 కేసులు

జైపూర్ - 537 కేసులు