యాంకర్ అనసూయ ఏం చేసిందో తెలుసా?

August 14, 2020

యాంకర్ అనసూయపై చాలామంది నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. కరో-నా అనంతరం అందరూ సాయం చేస్తున్నారు గాని నువ్వెందుకు చేయడం లేదు అని ఆమెను ప్రశ్నిస్తున్నారు. వాటిని ఆమె పట్టించుకోలేదు. నువ్వు చేయాలనుకుంటే చేయి. నేను చేసింది ఎవరికీ చెప్పాల్సిన, కనిపించాల్సిన అవసరం లేదంటూ కొందరికి రిప్లై కూడా ఇచ్చింది.

తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా అనసూయ ఒక మంచి పని చేసింది. కీసర మండలంలో వంద మంది గర్భిణులకు ఆమె పోషకాహారా కిట్స్ ను పంపిణీ చేసింది. ప్రతి ఒక్కరితో కాసేపు మాట్లాడింది. రాచకొండ పోలీస్ కమిషనర్ ఆమె సహాయం చేయడానికి ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాట్లు చేశారు. ఆమె చేసిన సాయానికి కమిషనర్ అనసూయను అభినందించారు.

సాక్షి న్యూస్ ప్రెజెంటర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ యాంకర్ గా, నటిగా ఎదిగి పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు. జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. జబర్దస్త్ అనసూయకు ఎంత ప్లస్సో, అనసూయ కూడా జబర్దస్త్ కు అంతే ప్లస్ అనే స్థాయికి చేరారు. ఆమెకు హేటర్స్ కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. కానీ ఆమె అభిమానులు ఈరోజు సామాజిక మాధ్యమాల్లో పుట్టిన రోజు శుభాకాంక్షలతో అనసూయను ముంచెత్తారు.