కలియు దాన వీర శూర కర్ణ... జయహో

August 11, 2020

మహాభారతంలో పంచపాండవులు, ద్రౌపది, కౌరవులు ఎంత బాగా మనకు గుర్తున్నారో ‘‘దానవీర శూర కర్ణుడు‘‘ కూడా అంతే బాగా తెలుసు. అలాంటి వ్యకిత్వం కేవలం కథలకే పరిమితం నిజం కాదనిపించేలా ఉంటుంది. కానీ అది నిజజీవితంలో సాధ్యం అని నిరూపించిన వ్యక్తి ‘‘సోనుసూద్‘‘. 

మానవత్వం లేని వాళ్లు ఈ భూమ్మీద ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరికీ దానికి పరిమితులుంటాయి. కానీ తన స్థాయికి మించి పరిమితులను దాటి మానవత్వం ప్రదర్శించి కలియుగ కర్ణుడు సోను సూద్. 

లాక్ డౌన్ లో ఎంతో మంది పుణ్యాత్ములు అభాగ్యులకు సాయం చేశారు. కానీ అత్యంత ఫలవంతమైన సాయం చేసింది మాత్రం సోనుసూద్. ఎక్కడికక్కడ చిక్కుకుపోయి ఆదుకునే నాథుడు లేక వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి చేరలేక బతికుండగానే నరకాన్ని చూసిన ఎంతో మందిని అక్కున చేర్చుకుని వారి సొంతూరికి పంపించారు సోనుసూద్. 

కేరళ నుంచి కాశ్మీర్ వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు మూల మూలన సోనుసూద్ చేసిన సాయం చేరింది. అతను ఖర్చుపెట్టిన ప్రతిరూపాయి నిజమైన బాధితుడికి చేరింది. 

ఇది కేవలం మానవత్వం కాదు, ఒక సక్సెస్ స్టోరీ. 

ఇది కేవలం ఆదుకోవడం కాదు, దేశాన్ని మార్చడంలో ఒక లెసన్.

ఇది కేవలం దాతృత్వం కాదు, మనిషి ఆలోచన విధానాన్ని మార్చేసిన ఒక పరిణామం.

అందుకే సోనుసూద్.... జయహో 

ఈ దేశానికి నిజమైన బాహుబలి సోనుసూద్

సోనుసూద్ జయహో !

బాహుబలి జయహో !