చంద్రబాబుకు... 70 వసంతాలు !!

June 04, 2020

ఇది చంద్రబాబు 70 వసంతాలు పూర్తి చేసుకుంటున్న రోజు 

ఏడు పదుల వయసులో వెయ్యి కిలోమీటర్లు నడవగలిగిన ఆరోగ్యం 

18 గంటలు కష్టపడగలిగిన ఓర్పు 

కొత్త పెట్టుబడులు తేగలిగిన నేర్పు 

భవిష్యత్తు నిర్మించలిగిన చాతుర్యం... 

అందుకే తెలుగు వారికి కష్టమొచ్చినపుడు గుర్తుకొచ్చే మనిషి చంద్రబాబు.

మన వాళ్లు పొగిడితే కిక్కేముంటుందోయ్.. మన ప్రతిపక్షం పొగిడితే కదా కిక్కు అన్నట్టు... చంద్రబాబు ఘనతను నిత్యం బాబును ద్వేషించే రాజకీయ ప్రతిపక్షం నోటితోనే ఈ ప్రపంచం విన్నది. అంతకు మించి ఒక నాయకుడికి ఇంకేం సక్సెస్ కావాలి. 

అందుకే 

చంద్రబాబు మార్గదర్శి ... 

నాయకుడు అంటే రాబోయే ఎన్నికల కోసం పనిచేసే వాడు 

మార్గదర్శి రాబోయే తరాల భవిష్యత్తు కోసం పనిచేసే వాడు 


సాధారణ నాయకుడు అనుచరులకి దారి చూపిస్తారు 

మార్గదర్శి భావితరాలకు దారి చూపిస్తారు 

 

సాధారణ నాయకుడు ప్రజల ఆస్తులను పన్నుగా పీల్చి పేదలకు పంచుతాడు

మార్గదర్శి పేదలను కూడా సొంతకాళ్లపై నిలబడి ఆస్తులు సంపాదించుకునేలా చేస్తాడు

సంక్షోభం నుంచి అవకాశాన్ని వెతుక్కొని కష్టాల్లో పొరాడగల ధైర్యాన్ని ఇవ్వగలిగిన ప్రజా నాయకుడు చంద్రబాబు. అతని చేతికి లోటు బడ్జెట్ ఇస్తే... దానిని మిగులు బడ్జెట్ చేయగలిగిన సమర్థత బాబుది !! ఈ రోజు తెలుగువాళ్లు శభాష్ అంటున్న కేసీఆర్ చంద్రబాబు గురించి అన్న ఒక్క మాట గుర్తుచేసుకోవాలి.... ’’గొర్రెతోక బెత్తెడు చందంగా ఉన్న బడ్జెట్ ను 10 వేల కోట్ల నుంచి 50 వేల కోట్లకు తీసుకెళ్లి సత్తా చంద్రబాబుది‘‘ మరి ఆయన సక్సెస్ కి ఇంతకు మించి ఏం కావాలి?
70 వసంతాలలో చిరునవ్వుతో ఉన్న మీరు  నూరేళ్లు ఇదే ఆరోగ్యంతో ఉండాలన్నది తెలుగు ప్రజల కోరిక.