​మహేష్ బాబు కి అరుదైన క్రేజు దక్కింది

February 24, 2020

ఒక తెలుగు హీరో పుట్టిన రోజు​ ట్విట్టరులో నెం.1 ట్రెండింగ్ లో ఉండటం కచ్చితంగా విశేషమే. ఈరోజు మహేష్ బాబు బర్త్ డే. మహేష్ అభిమానులు... టపటపా తమ ఫేవరెట్ హీరోకు శుభాకాంక్షలతో ట్వీట్ల వర్షం కురిపించడంతో అత్యంత వేగంగా 1 మిలియన్ బర్త్ డే ట్వీట్లు పడ్డాయి. ప్రస్తుతం 5 మిలియన్ల ట్వీట్లు దాటాయి.
#HappyBirthdaySSMB హ్యాష్ టాగ్ తో ట్విట్టరును ఊపేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. ఇదే రోజున సరిలేరు నీకెవ్వరు ఇంట్రో టీజరు కూడా #SarileruNeekevvaru ట్యాగ్ తో విపరీతంగా ట్రెండ్ అయ్యింది. ఈ సందర్భంగా ట్విట్టరులో షేర్ అవుతున్న కొన్ని మహేష్ అరుదైన ఫొటోలు, స్పెషల్ ఇమేజ్ లు మీకోసం