జగన్ పాలనపై హరీష్ రావు సెటైర్

July 05, 2020

జగన్ అభిమానులు తమ నాయకుడి పాలన గురించి ఆహా ఓహో అంటున్నారు. కాని వాస్తవాలు వేరు. ఏపీలో గత ఆరునెలలుగా ఏదో ఒక వర్గం ఇబ్బంది పడుతూనే ఉంది. ఇసుక సమస్య, స్కూళ్ల సమస్య, జీతాలసమస్య, పింఛన్ల సమస్య, తాజాగా రాజధాని సమస్య. ఇది కొనసాగుతూనే ఉంది. ఏపీలోని అనిశ్చితి పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులు ఇటువైపు మొహం చూపీయడం లేదు. దీంతో ఉపాధి, ఉద్యోగం తగ్గిపోయింది. వీటన్నింటికంటే పెద్ద దెబ్బ రియల్ ఎస్టేట్ పై పడింది. 

దీంతో దేశంలో ఆర్థిక మందగమనం నడుస్తున్న సమయంలో కూడా జగన్ వచ్చాక హైదరాబాదులో రియల్ ఎస్టేట్ బాగా పుంజుకుంది. ఓ సదస్సులో హరీష్ రావు మాట్లాడుతూ ఏపీలో పరిస్థితులు మీకు బాగా కలిసొచ్చాయి కదా అంటూ రియల్టర్లను హరీష్ ఓ పెద్ద కార్యక్రమంలో రెట్టించి అడిగారు. దానికి వారంతా సంతోషంగా అవునవును అంటూ స్పందించారు. జగన్ పాలన వలన వల్ల ఏపీ ప్రజలకు అక్కడి అభివృద్ధిపై అనుమానాలు కలగడంతో వారంతా తెలంగాణకి పెట్టుబడులను తరలించడం వల్ల ఇక్కడ బూమ్ పెరిగింది. ఇది బహిరంగ రహస్యం. ఈ విషయాన్ని హరీష్ రావు ప్రస్తావించారు.

ఈ వీడియోను లోకేష్ షేర్ చేస్తూ... జగన్ గారూ చూడండి మీ గురించి పక్క రాష్ట్రాల మంత్రులు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో అంటూ ఆ వీడియోను షేర్ చేశారు. పెట్టుబడిదారులకు, ప్రజలకు మన రాష్ట్రంపై నమ్మకం పోగొట్టావు జగన్ అంటూ లోకేష్ పరోక్షంగా వివరించినట్టయ్యింది.