తన పదవి కి ముప్పు తెచ్చుకున్న జగన్

August 13, 2020

న్యాయవ్యవస్థపై ఏపీలో అధికార పార్టీ నాయకులు చేస్తున్న దాడి సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. దేశ వ్యాప్తంగా జగన్ ప్రభుత్వ తీరును ఖండిస్తున్నారు. అసలు ఇంత బరితెగింపా అని ఆశ్యర్యపోతున్నారు. తాజాగా సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఏపీ లీడర్లపై మండిపడ్డారు. వారిని కంట్రోల్ చేయకపోతే న్యాయవవస్థకే ముప్పు అని హెచ్చరించారు.

సీఎన్ఎన్ ఫౌండేషన్ శనివారం న్యాయవ్యవస్థ గౌరవానికి భంగం కలిగిస్తూ జరుగుతున్న పరిణామాలపై చర్చ పెట్టింది. ఈ సందర్భంగా హరీష్ సాల్వే ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే... 

‘‘ ఇలాంటి వారికి గుణపాఠం చెప్పాలి. అది ఎలా ఉండాలంటే... న్యాయవ్యవస్థ గౌరవం నిలబెట్టేలా ఉండాలి. ప్రభుత్వ నిర్ణయాలపై కోర్టు వ్యతిరేక తీర్పులు ఇస్తే న్యాయమూర్తులపై ఆగ్రహం వ్యక్తంచేయడం ఏంటి? కులం పేరుతో నిందించడం, దూషించడం, బెదిరించడం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వారిని, కోర్టును తీవ్రంగా కించపరుస్తున్నారు. వీరికి గుణపాఠం బలంగా చెప్పాలన్నారు. 

ఏపీలో పౌర సమాజంతో పాటు, ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న ప్రజాప్రతినిధులు న్యాయవ్యవస్థపై సహించరాని విమర్శలు చేస్తున్నారు. వ్యవస్థలో భాగమైన వారు కోర్టుపై చేసే విమర్శలను చాలా సీరియస్ గా పరిగణించాల్సిన అసవరం ఉంది. వ్యవస్థలో ఉంటూ నేరుగా న్యాయమూర్తులను తిట్టడం క్షమించరానిది అన్నారు. ఒక ఎమ్మెల్యే న్యాయవ్యస్తను నిందించకూడదు. ఇది దేశంలో తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. వీటన్నిటికి ప్రత్యేకంగా ఒక ట్రైబ్యునల్ వేసి ఈ న్యాయమూర్తుల పరువు నష్టం కేసులను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ‘‘

సీఎన్ఎన్ ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ. అది ప్రత్యేకంగా ఒక చర్చ ఏర్పాటుచేసిందంటే కచ్చితంగా అది ఒక సీరియస్ ఘటన అయినా అయిఉండాలి, లేదంటే అత్యంత ప్రముఖమైన విషయమైనా అయిఉండాలి. ఏ స్థాయిలో జగన్ పార్టీ న్యాయవవస్థను చెరుస్తుందో, అది ఎంత స్థాయిలో దేశంలో చర్చ జరుగుతుందో అన్నది దీనిని బట్టి అర్థం చేసుకోవాలి. 151 సీట్లు కాదు 175 కి 175 సీట్లు వచ్చినా... ఈ సందర్భం నుంచి జగన్ పార్టీ బయటపడటం కష్టం. ఇంకా చెప్పాలంటే... అత్యంత దారుణమైన ఈ విధానం జగన్ పదవిని పీకేసే వరకు దారితీసినా అందులో ఆశ్చర్యం లేదు. 

 

జగన్ గమనించాల్సింది ఏంటంటే... రాజ్యాంగంలో రాసిన ప్రతిఅక్షరం, ఐపీసీలో ఉన్న ప్రతి అక్షరం అమలయ్యేలా చూడానికి అవసరమైన అన్ని అధికారాలను రాజ్యాంగం ద్వారా కోర్టుకు సంక్రమించాయి. రాజ్యాంగం పరిధిలో ఉన్నంత వరకే ఎవరైనా జగన్ ని రక్షించగలరు. రాజ్యాంగాన్ని మీరితే జగన్ ను ఎవరూ కాపాడలేరు. 

 

హరీష్ సాల్వే మాటల్లో... నేరుగా వినాలంటే కింద వీడియో లింకు క్లిక్ చేయండి 

https://twitter.com/i/status/1266977231609294848