జగన్ పాలన ఎలా ఉందంటే...

May 25, 2020

అరాచకానికి అడ్రెస్ గా జగన్ పాలన అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పోటెత్తుతున్నాయి. తనకు వ్యతిరేకంగా ఉన్న వారిపై అణచివేత ధోరణితో జగన్ ఎక్కువగా అందరికీ శత్రువు అవుతున్నారు. జగన్ హామీలన్నీ ఒకర్ని కొట్టి ఇంకొకరికి పెట్టేవి గా ఉన్నాయి. మీ సేవతో పాటు పలు ఉద్యోగాలు పీకేసి గ్రామ వలంటీర్ ఉద్యోగాలిచ్చారు. పేదల భూములు వారికిష్టం లేకుండా స్వాధీనం చేసుకుని పట్టాలు పంచుతాం అంటున్నారు. ప్రభుత్వ పథకాలకు కొర్రీలు పెడుతున్నారు ఫ్రీగా దొరికే ఇసుకను అమ్ముకుంటున్నారు. జనం ఊహించింది ఒకటి... జరుగుతున్నది ఒకటిగా మారింది జగన్ పాలన. పింఛన్లు కట్ చేసి వికలాంగులను, వృద్ధులను కూడా రోడ్డు పాలు చేస్తున్నారు జగన్. 

అణచివితే ఏ స్థాయిలో ఉందో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో చూస్తే అర్థమవుతుంది. మరో వారం రోజుల కోయాల్సిన పంటను బుల్డోజర్లతో నాశనం చేసి వాటిలో ప్లాట్లు వేసి పేదలకు పంచడానికి సిద్ధం చేస్తున్నారు. కఠిన మైన భూసేకరణ చట్టం ఉన్నా దానిని అతిక్రమిస్తున్నారు. చక్కటి పంటను నాశనం చేస్తూన్న బుల్డోజరు వీడియో అంతటా వైరల్ అయ్యి ప్రభుత్వ పరువు గంగలో కలిసింది. ఇపుడు జగన్ అభిమానులు కూడా మా అన్నకు పాలన రాదులే అనే స్థితికి వచ్చారు. 

జగన్ తీరుపై తాజాగా తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జరిగిన దళిత ఐక్యవేదిక సమావేశంలో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ధ్వజమెత్తారు. పేదల భూములు లాక్కుని ఇంకో పేదకు ఇవ్వడం ద్వారా జగన్ ఎవరిని ఉద్దరిస్తున్నారని జగన్ ని నిలదీశారు. పేదలపై ప్రేమ ఉంటే భూములు కొని పేదలకు పంచాలని సూచించారు. దళిత సంఘాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ప్రభుత్వ కుట్రలను అడ్డుకోవాలని హర్షకుమార్ పిలుపునిచ్చారు. అయినా... పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన జగన్ ఇప్పుడు అవినీతిని అంతం చేస్తాననడం అత్యంత హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.