కేసీఆర్ కలకు హైకోర్టు బ్రేక్ 

May 31, 2020

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చారిత్రక కట్టడం ఉన్న ఎర్రమంజిల్ లో కొత్త అసెంబ్లీ నిర్మించాలని కేసీఆర్ ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే జూన్ 27న భూమి పూజ కూడా చేశారు. ఇక కట్టడమే తరువాయి అన్న నేపథ్యంలో కేసీఆర్ కు భారీ దెబ్బ పడింది. అసెంబ్లీ కట్టడం మీ ఇష్టమే కావచ్చు గాని చారిత్రక కట్టడాన్ని కూల్చడం మాత్రం మీ ఇష్టం కాదు అంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. దీనిపై సమగ్ర సమాచారం మళ్లీ సమర్పించాలని పేర్కొంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఎర్రమంజిల్ చారిత్రక భవనం కూల్చొద్దు అని ఆదేశించింది.భారత రాజ్యాంగం ప్రకారం.. ప్రజాప్రతినిధులు, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ... మూడు ఎవరికి వారు ప్రత్యేకం, స్వతంత్రం. ఒకరి దాంట్లో ఇంకొకరు వేలు పెట్టడానికి వీలులేదు. అయితే, రాజ్యాంగ ఉల్లంఘన జరిగినపుడు దాని రక్షణకు, పౌరుల రక్షణకు న్యాయవ్యవస్థ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కలగజేసుకుంటుంది.

ఇపుడు వినియోగంలో ఉన్నా లేకపోయినా... ఎర్రమంజిల్ అనేది హైదరాబాదును చారిత్రక నగరాన్ని చూపడంలో దాని పాత్ర దానికుంది. అలాంటపుడు దానిని కూల్చి అక్కడే అసెంబ్లీ కట్టాలనుకోవడం సరికాదని హైకోర్టు పిటిషనర్లు చేసిన వాదనతో ఏకీభవించింది. మన వారసత్వ సంపదను మనమే కూల్చుకోవడం ఏంటని ప్రశ్నించింది. ప్రభుత్వ వాదనలో పసలేదు అని చెప్పింది. మరోవైపు మంచి అసెంబ్లీ ఉండగా... ప్రజాధనం వృథా చేసి ఎందుకు కట్టడం అన్న పిటిషన్ల వాదనకే కోర్టు మద్దతు పలికింది. దీంతో వచ్చే ఉగాదికి కొత్త అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న కేసీఆర్ కల చెదిరింది. 

Read Also

బీజేపీ మాస్ట‌ర్ స్ట్రోక్‌ : సార్ కి దిమ్మతిరిగింది
అసెంబ్లీ సాక్షిగా హరీష్ ఆశలు ఆవిరి... ఎప్పటికీ మంత్రే!
కేసీఆర్‌పై రాములమ్మ ఫైర్