కాఫీ షాప్ వద్దని.. ఆమెను హోటల్ రూమ్ కి తీసుకెళ్లాడట

July 05, 2020

మీటూ పుణ్యమా అని.. సినీ పరిశ్రమలోని చీకటి కోణాల్ని చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్క నటి మాట్లాడుతున్న పరిస్థితి. కొంతమంది నటీమణులు హిపోక్రసీతో తమకు ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని చెప్పటం తెలిసిందే. ఇలాంటి వారిని పక్కన పెట్టేస్తే.. నిజాయితీగా తమకు ఎదురైన చేదు అనుభవాల్ని ధైర్యంగా చెప్పే టాప్ నటీమణులు కొందరు ఉన్నారు.
అలాంటి కోవకే వస్తారు.. బాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరైన విద్యాబాలన్. ఒక హీరోయిన్ ఎలా ఉండకూడదన్న కొలతలకు.. లెక్కలకు భిన్నంగా ఉండటమే కాదు.. తన నటనతో కోట్లాది మందిన అభిమానుల మనసుల్ని దోచేసుకున్నారు విద్యాబాలన్. తాజాగా ఆమె నటించిన మిషన్ మంగళ్ యాన్ ఎంతటి సక్సెస్ సాధించిందో తెలిసిందే.
జాతీయ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్న ఆమె.. గ్లామర్ పాత్రల కంటే కూడా గ్రామర్ పాత్రల్ని ఎంపిక చేసుకుంటూ పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకన్నారు. అయితే.. ఆమెకు రాత్రికి రాత్నే గుర్తింపు.. పేరు ప్రఖ్యాతులేమీ రాలేదు. ఎంతో కష్టం.. మరెన్నో అవమానాలు.. ఇంకెన్నో కఠిన పరీక్షల్ని అధిగమించాకే ఆమె ఇప్పుడున్న స్థానానికి చేరుకున్నారని చెప్పాలి.
1990లో హమ్ పాంచ్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. 2003లో సినిమాల్లో యాక్ట్ చేయటం షురూ చేశారు. తన నట జీవితంలో ఎన్నో ఇబ్బందుల్ని.. అటుపోట్లను తాను ఎదుర్కొన్నట్లు చెప్పారు. తాను చెన్నైలో ఉన్నప్పుడు జరిగిన ఒక ఉదంతాన్ని చెప్పి విస్మయానికి గురి చేశారు విద్యాబాలన్.
చెన్నైలో తాను ఉన్నప్పుడు తనను కలవటానికి ఒక దర్శకుడు వచ్చాడని.. అతన్ని కలిసేందుకు కాఫీ షాప్ లో కూర్చొని మాట్లాడుకుందామని అంటే.. అతను ఒప్పుకోలేదన్నారు. చివరకు హోటల్ రూమ్ కు వెళ్లాలన్న మాటతో అయిష్టంగానే వెళ్లానని.. అయితే హోటల్ రూమ్ తలుపులు మూసేందుకు మాత్రం తాను కచ్ఛితంగా నో చెప్పేసినట్లు చెప్పారు. దాంతో అతను వెళ్లిపోయాడని.. అతడెందుకు వెళ్లాడో క్షణకాలం పాటు అర్థం కాలేదని.. కానీ అర్థమయ్యాక మాత్రం తానెంతో భయపడినట్లుగా చెప్పారు. ఇలాంటి పలు ఉదంతాలు తనకు ఎదురైనట్లు చెప్పారు విద్యాబాలన్.