దేవుడు గొప్పవాడు... ఆస్ట్రేలియా మొగ్గ తొడుగుతోంది

August 03, 2020

మనకు పొగ రాలేదు

ఆ వేడి తగలలేదు

కానీ ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధ మాత్రం మన గుండెను తాకింది. ప్రపంచ చరిత్రలో అతిపెద్ద ప్రమాదంగా 2020 ఆస్ట్రేలియా ఫైర్ ను పేర్కొనవచ్చు. 500 కోట్ల జంతువులు చనిపోవడం చరిత్రలోనే అరుదైన ఘటన. 12 మిలియన్ల ఎకరాల మంటల్లో తగలబడటం ప్రపంచ చరిత్రలో మొదటిసారి. భూమాతకు పచ్చని చీరను తగలబెట్టిన ఈ మహా ఘోరం మునుపెన్నడూ ఇంత పెద్ద ఎత్తున జరగలేదు. కానీ ప్రకృతికి గాయాలు మరిచిపోయే శక్తి ఉంది. గాయాలు మాన్పించుకునే శక్తి ఉంది. సరిదిద్దలేని నష్టం జరిగిపోయింది. మన గాలి చెడిపోయింది. ఈ అతిపెద్ద బ్యాడ్ న్యూస్ తర్వాత అనతి కాలంలోనే మనకు భవిష్యత్తుపై ఆశ కల్పించే ఒక పరిణామం జరుగుతోంది. కాలి బూడిదైన ఆస్ట్రేలియా నేలలు మెల్లగా బూడిద నుంచే మొగ్గ తొడుగుతున్నాయి. ఇది ప్రకృతి శక్తి. కన్నీరు కారిన కంట్లో ఆనందభాష్పాలు కార్పించిన ఆ ప్రకృతి హీలింగ్ పవర్ కు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఆ దృశ్యాలు చూడండి.