తెలంగాణకు తలంటారు !

May 31, 2020

అద్భుతంగా కరోనాను అదుపు చేస్తున్నాం అని చెబుతున్న తెలంగాణకు కేంద్రం తలంటింది. పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం  అలసత్వంపై  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన అసంతృప్తిని వ్యక్తం చేసింది, “క్రియాశీలంగా పరీక్షలు లేకపోవడం” మహమ్మారి వైరస్ వ్యాప్తిని అరికట్టలేదని... పేర్కొంది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశవ్యాప్తంగా నిర్వహించిన 14 లక్షలకు పైగా ఆర్టీ-పిసిఆర్ (రియల్ టైమ్ పాలిమరేస్ చైన్ రియాక్షన్) పరీక్షలలో తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన పరీక్షల సంఖ్య 1.5 శాతం (20,754) మాత్రమే. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్ కంటే చాలా తక్కువ నమూనాలను రాష్ట్రం పరీక్షించిందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సుడాన్ అభిప్రాయపడ్డారు. 
పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రతిరోజూ 9,000 పరీక్షలు నిర్వహిస్తుండగా, రోజుకు తెలంగాణ పరీక్షలు 200 దాటడం లేదు.  రాష్ట్రంలోని మిలియన్ జనాభాకు కరోనావైరస్ పరీక్షలను లెక్కలోకి తీసుకుంటే జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉంది. జాతీయ సగటు రోజుకు 1,025 ఉండా... తెలంగాణ మిలియన్ జనాభాకు 546 మందిని మాత్రమే పరీక్షించింది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం... మహమ్మారి వ్యాప్తిని అరికట్టాలంటే.. విస్తృతంగా RT-PCR పరీక్షలు చేయాలని సూచించారు. ఆర్టీ-పిసిఆర్ పరీక్ష కోసం రాష్ట్రం ప్రైవేట్ ల్యాబులను ఉపయోగించలేదని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి విమర్శించారు. అందుబాటులో ఉన్న సామర్థ్యాలను ఉపయోగించుకోకపోవడాన్ని తప్పుపట్టింది.

Read Also

కూకట పల్లికి షాక్ - తెలంగాణలో కొత్త రికార్డు
కేసీఆర్ పొత్తులపై గాలి తీసిన రేవంత్
నోటి దూల... కేసు దాకా తీసుకెళ్లింది !!