మోడీ అడ్డాలో ఎయిర్ పోర్ట్ మూసేశారు

May 29, 2020

ప్రధాని నరేంద్రమోడీ ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంగా వడోదర వార్తల్లో నిలిచింది. 2014లో బీజేపీ ప్రధాని అభ్యర్థి బరిలోకి దిగిన ఆయన.. అప్పట్లో రెండు ఎంపీ స్థానాల నుంచి పోటీ చేయటం తెలిసిందే. రెండింటిలోనూ గెలిచిన మోడీ వడోదర ఎంపీ స్థానానికి రాజీనామా చేసి.. తాను గెలిచిన కాశీ ఎంపీగా కంటిన్యూ అయ్యారు. ఇదిలా ఉంటే.. తాజాగా వడోదర మరోసారి వార్తల్లో నిలిచింది.
ఇటీవల కాలంలో కురుస్తున్న భారీ వర్షాలు గుజరాత్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తాజాగా వడోదరలో కురిసిన భారీ వర్షం కారణంగా విమానాశ్రయాన్ని మూసివేశారు. స్థానికంగా ఉన్న స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అంతేకాదు.. వడోదర నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాల కారణంగా ఎయిర్ పోర్ట్ లోకి నీళ్లు రావటంతో ఎయిర్ పోర్ట్ ను మూసివేశారు.
గుజరాత్ రాష్ట్రంలోనే అత్యధికంగా వడోదరలో అత్యధికంగా 442 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖాధికారులు పేర్కొంటున్నారు. రానున్న మూడు రోజుల్లో మరింత భారీగా వర్షాలు కురిసే నేపథ్యంలో..అధికారులు అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు. భారీ వర్షం వడోదరను ఉక్కిరిబిక్కిరి చేస్తుందని చెప్పక తప్పదు.