డామినేషన్ వల్లే ఆమె అవుట్

August 07, 2020

అంచ‌నాలు నిజ‌మ‌య్యాయి. బ‌య‌ట‌కొచ్చిన లీకులు వాస్త‌వ‌మ‌ని తేలింది. బిగ్ బాస్ సీజ‌న్ 3లో తొలి ఎలిమినేట్ అయిన హౌస్ మేట్ గా న‌టి హేమ నిలిచారు. హౌస్ లో అంద‌రిని డామినేట్ చేస్తుంద‌ని.. అధికారాన్ని చెలాయిస్తుంద‌ని.. హౌస్ మేట్స్ అంద‌రి చేత ఫిర్యాదులు అందుకున్న ఆమెను.. ప్రేక్ష‌కులు సైతం హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేలా తీర్పు ఇవ్వ‌టంతో ఆమె బ‌య‌ట‌కు రాక త‌ప్ప‌లేదు.
తొలివారంలో 1.30 కోట్ల ఓట్లు వ‌చ్చిన‌ట్లుగా నాగార్జున వెల్ల‌డించారు. ఇంట్లో మెజార్టీ స‌భ్యులు హేమ‌ను బ్యాడ్ ప‌ర్స‌న్ గా ఎంచుకున్నార‌ని.. బ‌య‌ట ప్ర‌జ‌ల ఓటింగ్ లో కూడా ఆమెకు అలాంటి భావ‌నే ప్ర‌జ‌ల్లో క‌లిగేలా చేశార‌ని.. దీంతో ఆమెకు అతి త‌క్కువ ఓట్లు వ‌చ్చిన‌ట్లుగా పేర్కొన్నారు.
తొలివారం ఎలిమినేష‌న్ ఎదుర్కొంటున్న ఆరుగురిలో శ‌నివారం ఎపిసోడ్ లోనే ఇద్ద‌రిని సేఫ్ చేసిన బిగ్ బాస్.. ఆదివారం మ‌రో ఇద్ద‌రిని తొలుత సేఫ్ గా ఉన్న‌ట్లు డిక్లేర్ చేశారు. చివ‌ర‌కు ఎలిమినేష‌న్ గండాన్ని టీవీ9 జాఫ‌ర్.. న‌టి హేమ ఎదుర్కొన్నారు. అయితే.. అంద‌రి కంటే త‌క్కువ ఓట్లు వ‌చ్చిన హేమ ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన‌ట్లుగా నాగార్జున పేర్కొన్నారు. దీంతో.. ఆమె తొలి వారాంతంలో అంద‌రికి గుడ్ బై చెప్పేసి ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు.
ఇదిలా ఉంటే.. హేమ స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు బిగ్ బాస్ హౌస్ లోకి ఊహించ‌ని రీతిలో కొత్త కంటెస్టెంట్ ను ఇంట్లోకి పంపారు. వైల్డ్ కార్డు ఎంట్రీతో త‌మ‌న్నా సింహాద్రి ఎంట్రీ ఇచ్చారు. సాధార‌ణంగా బిగ్ బాస్ హౌస్ కు సంబంధించి లీకులు ఎపిసోడ్ టెలికాస్ట్ కు రెండు రోజుల ముందే వ‌చ్చేస్తున్న వైనానికి భిన్నంగా త‌మ‌న్నా వ్య‌వ‌హారం ఆదివారం మ‌ధ్యాహ్నం నుంచి లీకులు బ‌య‌ట‌కొచ్చాయి. గ‌తంతో పోలిస్తే.. వైల్డ్ కార్డు ఎంట్రీ వివ‌రాలు కాస్త ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చాయని చెప్పాలి.
వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌస్ లోకి వెళ్లేందుకు ఎంపికైన త‌మ‌న్నా త‌న‌ను తాను ప‌రిచ‌యం చేసుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే అవ‌కాశం ల‌భించ‌టంతో త‌న క‌ల నెర‌వేరిన‌ట్లుగా చెప్పారు. ట్రాన్స్ జెండ‌ర్ అయిన త‌న‌కు అవ‌కాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. తానేంటో ఫ్రూవ్ చేసుకుంటాన‌ని.. హౌస్ లో చివ‌రి వ‌ర‌కు ఉంటాన‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.
రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్ర‌జ‌ల్ని త‌న కుటుంబంగా చేసుకుంటాన‌ని చెప్పిన త‌మ‌న్నా.. హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వ‌లేదు. ఎందుకంటే.. బిగ్ బాస్ తుది ఆజ్ఞ వ‌ర‌కూ వెయిట్ చేయాల‌ని.. ఆయ‌న చెప్పిన త‌ర్వాతే హౌస్ లోకి వెళ్లాల‌న‌ని నాగార్జున చెప్ప‌టంతో ఓకే చెప్పారు. త‌మ‌న్నా ఎంట్రీ ఇత‌ర హౌస్ మేట్స్ కు స‌మాచారం లేదు. ఎప్పుడు పంపుతారు? త‌మ‌న్నాఎంట్రీపై ఇంటి స‌భ్యులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.