అత్తాకోడలి విరాళం కోటి !!

August 15, 2020
CTYPE html>
మొన్న చంద్రబాబు ఆల్రెడీ విరాళం ప్రకటించారు కదా. మళ్లీ భువనేశ్వరి విరాళం ఇచ్చారా ? అనుకుంటున్నారా? హెరిటేజ్ ఎండీ హోదాలో కంపెనీ తరఫున ఆమె ఈ విరాళం ప్రకటించారు. ప్రస్తుతం హెరిటేజ్ సూపర్ మార్కెట్స్ బిగ్ బజార్ కు చెందిన ఫ్యూచర్ గ్రూపునకు అమ్మేసినా... హెరిటేజ్ ఫుడ్స్ విభాగం చంద్రబాబు కుటుంబంతోనే ఉంది. మొన్న కుటుంబం తరఫున 10 లక్షలు ప్రకటించారు. నేడు కంపెనీ తరఫున కోటి రూపాయలు ప్రకటించారు. ఈ కోటి రూపాయలు తెలంగాణకు 30 లక్షలు, ఆంధ్రాకు 30 లక్షలు ... హెరిటేజ్ ఫుడ్స్ సరఫరా అయ్యే మిగతా రాష్ట్రాలకు పది లక్షలు చొప్పున ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తారు.  
మరోవైపు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వారి నెల జీతాన్ని విరాళంగా ఇచ్చేశారు. నారా భువనేశ్వరి, కోడలు నారాబ్రాహ్మణి కంపెనీ తరఫున తాజా విరాళం ప్రకటించారు. దేశం చాలా ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో తమ వంతు బాధ్యతగా ఈ విరాళం ప్రకటించినట్లు భువనేశ్వరి తెలిపారు. ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించడం, సామాజిక దూరం పాటించడం, ఇళ్లలోనే ఉండటం ద్వారా ఈ వ్యాధిని అరికట్టొచ్చని పిలుపునిచ్చారు. కరోనా అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రజల సహకారం లేకపోతే కరోనా అరికట్టడం ప్రభుత్వం వల్ల కూడా అసాధ్యం అన్నారు.