బుగ్గన చెప్పింది అబద్ధమని తేల్చేశారు

February 21, 2020

వైసీపీ నాయకుల రాజకీయం చూస్తుంటే ఒక్కోసారి ఏంట్రా వీళ్లు ఇలా ఉన్నారు అని ప్రతిపక్షాలు భయపడే పరిస్థితి. సాక్షిలో వచ్చింది నాకు సంబంధం లేదు... నేను చెప్పింది మాత్రమే నాకు సంబంధం అని అసెంబ్లీ సాక్షిగా జగన్ చంద్రబాబుపై ఎదురుదాడి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాక్షి జగన్ ది అని ఎవరికి తెలియదు? 

ఏపీ ఐదేళ్లలో 8 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే... 7 లక్షల కోట్లు చంద్రబాబు తినేశాడంటారు.. అసలు ఐదేళ్లలో జీతాలకే 4 లక్షల కోట్లు సరిపోతాయి. మిగతా 3 లక్షల్లో అనేక పథకాలు, రోడ్లు మౌలిక సదుపాయాలు ఇలా ఎన్నో ఉన్నాయి.. అయినా పచ్చి అబద్ధం ప్రచారం చేశారు. చివరకు అధికారంలోకి వచ్చాక అవినీతి గురించి చంద్రబాబుపై ఒక్క కేసు కూడా పెట్టలేకపోయారు జగన్ రెడ్డి. 

తాజాగా అసెంబ్లీ సమావేశాల చివరి రోజు హెరిటేజ్ కంపెనీ 2014లో రాజధాని వస్తుందని తెలుసుకుని భూమి కొన్నట్లు బుగ్గన అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పారు. దానిపై హెరిటేజ్ యాజమాన్యం (ఫ్యూచర్ గ్రూపు) గట్టిగా స్పందించింది. అబద్ధాలు ప్రచారం చేయకండి. హెరిటేజ్ కోసం కంతేరులో 14.22 ఎకరాల భూమి కొనాలని నిర్ణయం తీసుకున్నాం...  మేము నిర్ణయం తీసుకున్నది 2014 మార్చిలో. అంటే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడక ముందే మేము భూమి ఎంపిక చేశాం. మా అవసరాలకు మంచి వ్యవసాయ ప్రాంతం అవసరం కాబట్టి అక్కడ ఎంపిక చేసుకున్నాం. జులైలో రిజిస్ట్రేషను జరిగింది. ఆ తర్వాత ఎపుడో రాజధాని వ్యవహారం తెరపైకి వచ్చింది. సంస్థ ఉద్దేశాలను తప్పుగా చూపిస్తూ దుష్ప్రచారం చేయొద్దు అని సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.