వైసీపీ నేతలందరూ ఈ భువనేశ్వరి వీడియో చూడాలి

August 03, 2020

ఒక చిన్న అవకాశం ద్వారా శత్రువులను దెబ్బకొట్టడంలో వైసీపీ పార్టీకి ప్రత్యేక స్కిల్ ఉంది. అబద్ధాన్ని పాత సాక్ష్యాలతో నమ్మించి ప్రజల్లో తమ శత్రువులను చులకన చేయడం, ఇబ్బంది పెట్టడం, తక్కువ చేయడం అనే సరికొత్త వ్యూహం ద్వారా జగన్ 2019లో అధికారాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి హోదాలో  ఉండి, స్వయంగా బిజినెస్ మెన్ అయిన జగన్ కు... హెరిటేజ్ ఫ్రెష్ ని అమ్మేసిన విషయం తెలియకుండా ఉంటుందా ? ఉండదు కదా. అయితే... గతంలో అది చంద్రబాబు కుటుంబానిది కాబట్టి ఇప్పటికీ ఉల్లి విషయంలో తనపై ప్రజలు కోపగించుకోకుండా హెరిటేజ్ అడ్డంపెట్టి తప్పించాలనే ప్రయత్నం చేశారు జగన్. 

వైసీపీ నేతలు అందరూ మూకుమ్మడిగా హెరిటేజ్ ఫ్రెష్ లో చంద్రబాబు ఉల్లి కిలో 200 అమ్ముతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ మీడియా భువనేశ్వరిని ప్రశ్నించగా... వైసీపీ నేతలందరికీ జ్జానోదయం చేస్తూ భువనేశ్వరి క్లారిటీ ఇచ్చారు. అది మీరే చూడండి.