కేటీఆర్ ఐడియాకు, జగన్ కి మ్యాచ్ కావడం లేదే

August 13, 2020

ఈరోజు ఒక విషయం గమనించారా... వేర్వేరు కార్య్రమ్రమాల్లో పాల్గొంటున్న కేటీఆర్ దూకుడుగా తిరుగుతున్నారు. ఈ క్రమంలో సూర్యపేట జిల్లాలోని హుజూర్ నగర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో కేటీఆర్ ఒక సంచలన ప్రతిపాదన మరోసారి తెరపైకి తెచ్చారు. 

హైదరాబాదు విజయవాడ మధ్య హైస్పీడ్ రైల్ తేవాలన్నది కేటీఆర్ ఆలోచన అట. ఈ పనిచేస్తే హైవే వెంబడి భారీగా అభివృద్ధి ప్రాజెక్టులు వస్తాయట. రెండు రాష్ట్రాల ఆర్థిక సంబంధాలు బలపడతాయట. విజయవాడ ముఖ్యమైన ఆర్థిక కేంద్రమట, హైదరాబాదు మెట్రో సిటీ అట. రెండింటినీ కలిపితే ఇక అద్భుతాలు చేయొచ్చుంటున్నారు కేటీఆర్. 

విజయవాడ గురించి పక్క రాష్ట్ర మంత్రికి, తన స్నేహితుడికి ఉన్న అవగాహన ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి లేదా? విజయవాడ-అమరావతిని అభివృద్ధి ఎంత కీలకమో ఈరోజు కొడుకు చెప్పాడు. ఆ నాడు తండ్రి కేసీఆర్ అమరావతి వేదికపైన చెప్పారు. కానీ జగన్ మాత్రం మూడు రాజధానులంటున్నారు. (ఆ ఆలోచన దాదాపు అదృశ్యమవుతోంది అది వేరే విషయం). 

అమరావతి రాజధాని అయితే ఏర్పడే కనెక్టివిటీ ఏమిటో జగన్ కంటే కేటీఆర్ కి బాగా అర్థమైనట్టుంది. జగన్ మాత్రం బ్లాక్ బ్లస్టర్ బ్రాండ్లను తయారుచేయడంలో బిజీగా ఉండి అసలు విషయాలను పక్కన పెడుతున్నారు. అందుకే కేటీఆర్ చెప్పిన ప్రతిపాదన బాగానే ఉంది గానీ జగన్ మూడు రాజధానులు చేస్తే మళ్లీ దీని ఉపయోగం పడిపోతుంది. అయితే, కాగల కార్యం గంధర్వుడు తీర్చినట్టు... అమరావతి కదిలింపును కరోనా ఆపేసింది.