జగన్ ఒకటి తలిస్తే... హైకోర్టు ఇంకోటి తలుస్తుంది

June 01, 2020

కరోనా వేళ.. యావత్ దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో..ఎవరికి వారు ఎక్కడికక్కడ ఉండిపోవాలని కోరుతున్నారు. ఇందుకు భిన్నంగా వివిధ కారణాలతో హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఏపీలోని తమ స్వస్థలాలకు వెళ్లేందుు భారీగా రావటం తెలిసిందే. తమను హాస్టల్స్ ఖాళీ చేయాలని చెప్పటంతో.. తాము ఇళ్లకు వెళ్లేలా అనుమతి పత్రాలు ఇవ్వాలని కోరటం.. అందుకు తగ్గట్లే తెలంగాణ పోలీసులు పలువురు లేఖలు జారీ చేయటం తెలిసిందే.
వీటిని తీసుకున్న ప్రజలు ఏపీకి వెళ్లగా.. సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు వారు అనుమతి నిరాకరించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నో చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఏపీ సీఎంకు ఫోన్ చేయటం తెలిసిందే. కరోనా లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఏపీలోకి ఎంట్రీ ఇవ్వాలంటే.. పద్నాలుగు రోజులు క్వారంటైన్ సెంటర్లలో ఉంటామంటే కానీ.. అనుమతించమని సీఎం జగన్ సైతం చెప్పేశారు.
ఇలాంటివేళ.. బీజేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణ ఏపీ హైకోర్టులో పిటిషన్ జారీ చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా కీలక ఆదేశాల్ని జారీ చేసింది. తెలంగాణలో ఇచ్చిన అనుమతి పత్రాల్ని ఎంట్రీ పాయింట్లోనే పరిశీలించాలని.. ఆరోగ్య పరంగా బాగుంటే అనుమతించాలని కోరారు. ఒకవేళ ఆరోగ్యం సరిగా లేకుండా క్వారంటైన్ కేంద్రాలకు తరలించారన్నారు. అంతేకాదు.. క్వారంటైన్ అవసరం లేకున్నా.. స్వచ్చంద నిర్భందంలో ఉండిపోయేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏపీకి రావటానికి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వేసిన పిటిషన్ పై హైకోర్టు స్పందించి.. తాజా ఆదేశాలు జారీ చేశారు. తాజా ఆదేశాల నేపథ్యంలో క్వారంటైన్ కేంద్రాలపై నిఘా ఉంచాలని.. అందులో ఉన్న వారి యోగక్షేమాలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని చెప్పింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో హైదరాబాద్ లో ఉండే ఏపీకి చెందిన వారికి కొత్త ఊరట ఇస్తుందని చెప్పక తప్పదు.  

కొసమెరుపు ఏంటంటే... జగన్ ఏమనుకుంటే దానికి కోర్టుల్లో రివర్స్ జరగుతోంది. ప్రతి విషయంలోనే ఇదే. మొన్నటి ఎన్నికల వాయిదా విషయంలోను ఇదే జరిగింది. తాజాగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఎవరూ రావద్దు అంటే... కోర్టు మాత్రం రావడానికి ఓకే చెప్పింది.