జగన్ కు దెబ్బ మీద దెబ్బ... అయినా !

June 02, 2020

జగన్ రెండు రికార్డులు సాధించారు. ఒకటి అతి తక్కువ కాలంలో కోర్టులో అత్యధిక మొట్టికాయలు తిన్న సీఎం. రెండోది... చరిత్రలోనే అత్యధిక మొట్టికాయలు తిన్న సీఎం. ఈ రెండు రికార్డులు జగన్ వే. ప్రతి నిర్ణయం వెనుక దురుద్దేశం, ఓట్ల రాజకీయం, ఇగో, గత ప్రభుత్వ నిర్ణయాలను ఉత్తినే కాలరాయడం వంటి తప్పుడు ఉద్దేశాల వల్ జగన్ కు కోర్టల్లో ఇన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కీలక నిర్ణయాలు  తీసుకునే ముందు పరిశీలన, అవగాహన, పరిశోధన, నిపుణుల సహాలు సేకరించడం వంటివేమీ చేయకపోవడం వల్ల ఈ తలనొప్పులు వస్తున్నాయి. ఇప్పటికే రాజధాని తరలింపు, కర్నూలుకు విజిలెన్స్ కార్యాలయం తరలింపు, స్థానిక సంస్థల ఎన్నికలపై వరుస దెబ్బలు తిన్న జగన్ సర్కారు... తాజాగా కోర్టులో మరోసారి బొక్కబోర్లా పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమం జీవోలను కోర్టు కొట్టేసింది. ఇది జగన్ ఊహించని సంచలన తీర్పు. 

గత టీడీపీ ప్రభుత్వం కేవలం పట్టణ కేంద్రాల్లో కొన్ని స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించింది. దానిని జగన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తెలుగును చంపేస్తారా అని గోలపెట్టారు. కానీ జగన్ వచ్చాక అదే పని మొత్తం అన్ని స్కూళ్లలో చేశారు. పేదలకు ఇంగ్లిష్ మీడియం పెడితే వద్దంటారా అని ఒక ఎమోషన్ తో ఏపీ ని బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చారు జగన్. దీనిపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున రచ్చ కూడా జరిగింది. ఒక తెలుగు రాష్ట్రంలో తెలుగు భాషకే దిక్కులేకపోతే ఎలా అంటూ చాలామంది కోర్టుకు వెళ్లారు. ప్రతిపక్షం కూడా ేకేసు వేసింది. 

వీటిని విచారించిన కోర్టు ఈరోజు కొన్ని ఆదేశాలు జారీచేసింది. ఇంగ్లిష్ మీడియం జీవోలపై తాము తదుపరి ఉత్తర్వులు జారీచేసే దాకా వేచి చూడాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను జగన్ సర్కారు నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఏ మాధ్యమంలో చదవాలన్న అంశం విద్యార్థుల నిర్ణయానికి వదిలేయాలని ఓ పిటిషనర్‌ చేసిన వాదనతో ఏకీభవించిన హైకోర్టు  ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఇది జగన్ దూకుడుకు భారీ బ్రేకు. అనాలోచిత నిర్ణయానికి చెంపపెట్టు.