ఏపీ : ఆ లోగా రంగులు మార్చాల్సిందే - హైకోర్టు

June 01, 2020

కనిపించిన ప్రతి దానికీ రంగులేసి జనంలో అభాసుపాలైన వైసీపీ దాని గురించి ఏం గిల్టీ ఫీలవలేదు. రంగులపై సుప్రీంకోర్టుకు వెళ్లడమే వారి కాన్పిడెన్సుకు నిదర్శనం. చివరకు అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలి... హైకోర్టులోనే తేల్చుకోండి దీన్ని అని సుప్రీంకోర్టు తిప్పి పంపింది. చివరకు మళ్లీ హైకోర్టులో ఏపీ సర్కారు కొత్త వాదన మొదలుపెట్టింది. 

మూడు నెలల సమయం ఇవ్వండి. రంగులు మారుస్తాం అని తాను తెలివిగా వాదన వినిపించాను అనుకుంది. జడ్జి కూడా అంతే తెలివిగా... అంతే అంతవరకు ఎన్నికలు జరపకుండా ఉంటారా? అంటూ ప్రశ్నించి ఊహించని షాక్ ఇచ్చారు. రాజకీయ తెలివితేటలు అన్ని చోట్లా చెల్లవు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అయితే తాజాగా ఈరోజు దీనిపై హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. మూడు వారాలు సమయం ఇస్తాం. ఆ లోపు రంగులు మార్చండి అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోను రంగులు ఉండగా ఎన్నికలు జరగడానికి వీల్లేదని కోర్టు తేల్చి చెప్పింది. 

ఈ ఆదేశాలు సమంజసంగా ఉన్నాయి గాని... అపుడు వేయడానికి 1300 కోట్లు, ఇపుడు అవి మార్చడానికి ఇంచుమించుగా అంతే డబ్బులు ఖర్చుపెట్టాల్సి వస్తుంది. ఒకవేళ ఈ ఖర్చెందుకు అని వదిలేసే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే... తప్పు చేశాక ఎవరూ మార్చలేరు అని నాయకులు అలవాటు పడే ప్రమాదం ఉంటుంది. అందుకే కోర్టులు ఇలాంటి కేసుల్లో చాలా ముందుచూపుతో తీర్పులు ఇస్తాయి.