సోమవారం జగన్ కి బ్యాండ్ బాజానే !!

June 03, 2020

ఆంధ్రప్రదేశ్ కొత్త ఎన్నికల కమిషనర్ గా మద్రాస్ హైకోర్టు రిటైర్డు జస్టిస్ కనగరాజ్ ను ఏపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. పంచాయతీ రాజ్ చట్టానికి సవరణ చేస్తూ ఏపీ ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ కు గవర్నర్ హరిచందన్ ఆమోద ముద్ర వేయడంతో కనగరాజ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. దీంతో, మాజీ ఐఏఎస్, మాజీ సీఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలు మార్చి తనను పదవి నుంచి తొలగించారని, తాజా ఆర్డినెన్స్ తనకు వర్తించదని, తన పదవీ కాలం ముగిసిన తర్వాతే అది చెల్లుబాటు అవుతుందని నిమ్మగడ్డ తాను దాఖలు చేసిన పిటిషన్ లో వెల్లడించారు. నిమ్మగడ్డ పిటిషన్ పై సోమవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. ఆ పిటిషన్‌ పై విచారణణు హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఏప్రిల్ 17లోగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని కుదించడంతో పాటు అర్హతలలో మార్పులు చేస్తూ ఏపీ సర్కార్ కొత్త ఆర్డినెన్స్ ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఆర్డినెన్స్ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ముగిసిపోయింది. దీంతో, ఆయనను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత కొత్త సీఈసీగా రిటైర్డ జడ్జి కనగరాజ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. దీంతో, తన తొలగింపును సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. తన తొలగింపుపై హైకోర్టులో రమేష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై నేడు విచారణ జరిపిన హైకోర్టు.. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఈ నెల 17లోపు ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది. కాగా, రమేష్ కుమార్ తొలగింపుపై టీడీసీ తరపున వర్ల రామయ్య, బీజేపీ తరపున మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, మాజీ మంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.  

ఏకంగా ఇటీవల భారత మాజీ ఎన్నికల అధికారి కూడా జగన్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం అంటున్నారు. పైగా నిమ్మగడ్డది తప్పు అని నిరూపించే సరైన కారణం కూడా జగన్ ప్రభుత్వం వద్ద లేదు. ఈ నేపథ్యంలో సోమవారం వెలువడే తీర్పు కచ్చితంగా జగన్ కలలను కల్లలుగా మిగులుస్తుందనే అంటున్నారు.