జగన్ భజన- హైకోర్టుపై దాడి : కొమ్మినేనికి నోటీసులు

August 06, 2020

ఏపీ సీఎం జగన్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయన్న కారణంతో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు, మద్దతు దారులు హైకోర్టుకు దురుద్దేశాలు ఆపాదించడం, న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించడం వారిని తిట్డడం చేశారు. దూషణల ద్వారా హైకోర్టునే లొంగ దీసుకోవాలన్న వ్యూహంతో వైసీపీ చేసిన ప్రయత్నం తీవ్రంగా బ్యాక్ ఫైర్ అయ్యింది. ఇప్పటికే 49 మందికి నోటీసులు ఇచ్చిన హైకోర్టు నేడు మరో 44 మందికి చీవాట్లు పెడుతూ నోటీసులు జారీ చేసింది.

కోర్టులను కెలకడం ద్వారా వైసీపీ కార్యకర్తలు పార్టీకి పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టారు. వ్యవస్థల విధ్వంసం మరిన్ని దుష్పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంది. దీనిని మొగ్గలోనే తుంచకపోతే వ్యవస్థలకే ప్రమాదం అని భావించిన హైకోర్టు దూషణలకు పాల్పడిన వారిపై తీవ్ర చర్యలకు సిద్ధమైంది. మునుపటి లిస్టులో వైసీపీ ఎంపీ నందిగం సురేష్, వైసీపీ నేత ఆమంచి కృష్ణ మోహన్ ఉన్నారు.

తాజాగా హైకోర్టు నోటీసులు ఇచ్చిన 44 మందిలో ప్రముఖ టీవీ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ ఉన్నారు. అలాగే అనకాపల్లి ఎమ్మెల్యే  గుడివాడ అమర్నాథ్, మరో జర్నలిస్టు ప్రసాద్ రెడ్డి, పంచ్ ప్రభాకర్ తదితర 44 మందికి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. 

తొలి జాబితాల్లో మావాళ్లు 5 గురే మిగతా వారికి పార్టీకి సంబంధం లేదని వైసీపీ ఓ ప్రకటన విడుదల చేయడంతో వైసీపీ కోసం ఎగబడి తిట్టిన వారంతా అవాక్కయ్యారు. తాజాగా మరో 44 మందిపై కేసులు పెట్టడంతో వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు జడుసుకున్నాయి. 

సరిగ్గా నిమ్మగడ్డ కేసు బయటకు వచ్చిన రోజే ఆ ప్రస్ట్రేషను ను ఎక్కడ వెలిబుచ్చాలో తెలియక వైసీపీ శ్రేణులు ఇపుడు కిందా మీద పడుతున్నాయి. పోనీ టీడీపీని ఏమైనా అందాం అంటే... నిమ్మగడ్డ పిటిషను వేసింది బీజేపీ పార్టీ. వారిని కూడా ఏమీ అనలేని దుస్థితి.