కేసీఆర్ కి వాచిపోయింది

July 01, 2020

ముహూర్తాలను గట్టిగా నమ్మే కేసీఆర్... ఎంత మంచి ముహూర్తాలుపెట్టినా... కొత్త సచివాలయ నిర్మాణం విషయంలో ఏమీ ముందుకు వెళ్లడం లేదు. ఎలాగైనా కొత్తది కట్టాల్సిందే అని కేసీఆర్... కొత్త సచివాలయాన్ని ఆపాల్సిందే అని విపక్షాలు విపరీతంగా ట్రై చేస్తున్నాయి. ఇప్పటికే ఈ అంశం కోర్టులో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ హైకోర్టు సంధించిన ప్రశ్నలతో నిజంగానే తెలంగాణ ఉక్కిరిబిక్కిరి అయ్యింది.

అన్ని సదుపాయాలు ఉన్న సచివాలయం అందుబాటులో ఉండగా.. వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఎందుకు కొత్త సచివాలయం నిర్మించడం ? అంటూ పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నలతో ఊపిరాడకుండా చేసింది. దీంతో లాయర్ తడబడ్డాడు. దీంతో కేసీఆర్ సర్కారు  ఇబ్బందుల్లో పడింది.


1.  ఇప్పటికే అన్ని వసతులతో కూడిన సచివాలయం అందుబాటులో ఉండగా కొత్త సచివాలయం కట్టాల్సిన అవసరం ఉందా?  

2. అసలు ఇప్పుడున్న సచివాలయాన్ని ఎందుకు కూలుస్తున్నారు. ?

3. అగ్నిమాపక శాఖ ఇచ్చిన నివేదికను కూడా ప్రస్తావించిన హైకోర్టు... అగ్నిమాపక శాఖ కూడా ఇప్పుడున్న సచివాలయాన్ని కూల్చేయాలని చెప్పలేదు కదా ? 

4. అగ్ని ప్రమాదాల నివారణ చేపట్టాలని మాత్రమే కదా ఆ శాఖ సూచించింది?

5. ఏపీకి కేటాయించిన ఐదు బ్లాకులు అందుబాటులోకి వచ్చాక కూడా ఆ సచివాలయం అన్ని శాఖలకు సరిపోవడం లేదా? 

వీటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వ న్యాయవాది చెప్పిన ప్రతి కారణానికి కూడా ఓ వైపు నుంచి పిటిషనర్, మరోవైపు కోర్టు కూడా కౌంటర్లు ఇచ్చేస్తుంటే... సర్కారు న్యాయవాది అడ్డంగా దొరికిపోయారు. అయితే.. లా చదువుకున్న న్యాయవాది జడ్జి ప్రశ్నలకు తడబడ్డారు గానీ... పిటిషనరు మాత్రం ఫుల్ క్లారిటీతో ధర్మాసనానికి బ్రహ్మాండమైన సమాధానాలు టకటకా చెప్పేశారు.

కొసమెరుపు - ఇరువురి వాదనలు విన్న హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.