హైకోర్టు ఓకే...కేసీఆర్‌ను ఇక ఆప‌లేం

July 11, 2020

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు గొప్ప ఉప‌శ‌మ‌నే కాదు..తీపిక‌బురు కూడా. దాదాపు 50 రోజులుగా జ‌రుగుతున్న ఆర్టీసీ స‌మ్మెలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రూట్ల ప్రైవేటీకరణపై వాదనలు విన్న కోర్టు కేబినెట్ నిర్ణయాన్ని సమర్థించింది. 5,100 రూట్ల ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
తెలంగాణ‌ రాష్ట్రంలో 5,100 ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణను త‌ప్పుప‌డుతూ, రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖ‌లైంది. సుమారు రెండు వారాల పాటు దీర్ఘ‌కాలిక వాద‌న‌లు ఈ అంశ‌లో జ‌రిగాయి. అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. జీవో రాకముందు కేబినెట్ నిర్ణయాన్ని సవాల్ చేయొద్దని వాదించారు. ప్రభుత్వ వాదనలతో ధర్మాసనం ఏకీభవించి పిటిషనర్ వాదనను తోసిపుచ్చుతూ పిల్‌ను ధర్మాసనం కొట్టేసింది. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం రూట్ల విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. రూట్ల ప్రైవేటీకరణ విషయంలో జోక్యం చేసుకోమని కోర్టు తేల్చిచెప్పింది. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టలేమని వ్యాఖ్యానించింది.
అయితే, ప‌లు సూచ‌న‌లు, ష‌ర‌తులు కోర్టు పేర్కొంది. ప్రైవేటీక‌ర‌ణ‌ గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించే విషయంలో ప్రొసీజర్‌ను ఫాలో అవ్వాలని సూచించింది. మోటార్ వెహికల్ చట్టంలోని సెక్షన్ 102 ప్రకారం ఆ నిర్ణయాన్ని న్యూస్ పేపర్లలో యాడ్ ఇచ్చి, అభ్యంతరాల స్వీకరణకు 30 రోజుల టైం ఇవ్వాలని చెప్పింది. ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయంపై ముందుకెళ్లాలని తెలిపింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఏజీ… రూట్ల ప్రైవేటీకరణపై ఇంకా గెజిట్ వరకు వెళ్లలేదని, ప్రొసీజర్ ప్రకారమే ముందుకు వెళ్తామని కోర్టుకు చెప్పారు.