​మీరు మారరా.... 4 రంగులూ తీసెయ్, హైకోర్టు సీరియస్

August 13, 2020

తనకంటే తెలివైన వాడు లేడని జగన్ అనుకుంటూ ఉంటాడేమో. వైసీపీ రంగులు ప్రభుత్వ భవనాలకు వేయొద్దు అంటే... వైసీపీ మూడు రంగులకు తోడు బీజేపీ రంగు కూడా కలిపి వేసింది. ఇలాంటి వేషాలన్నీ కుదరవు... నీ జెండా రంగులు తుడపకుండా ఎన్ని రంగులు వేసినా అనుమతించేది లేదంటూ కోర్టు మళ్లీ చీవాట్లు పెట్టింది. తాజాగా​ 4 రంగులతో జారీ చేసిన జీవో నె.623 ను కూడా హైకోర్టు కొట్టి వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కొన్ని నెలల క్రితం వైసీపీ అధికారంలోకి రాగానే చెట్టు, పుట్ట, సమాధి, జాతీయ జెండా, గాంధీ బొమ్మ వంటివేమీ వదలకుండా ప్రతి దానికీ వైసీపీ జెండా రంగులు వేశారు. జనం నవ్వుకున్నా జగన్ బుద్ధి మారలేదు. తాను జనానికి డబ్బులిస్తాను కాబట్టి నేను ఏం చేసినా, ఎంత సంపాదించినా ఏమనుకోరు అన్న కోణంలో వైసీపీ సర్కారు ముందుకు సాగింది. జాతీయ జెండాకు రంగులేయడంపై దేశంలో అన్ని మీడియాలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడంతో వైసీపీ ఆ ఒక్కదాన్ని మార్చింది. కానీ పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగులు మాత్రం తొలగించలేదు. వైకాపా కార్యాలయాలకు వేసినట్లు వాటికి పార్టీ రంగులు వేసింది. ఇలా వేస్తే కోర్టు ఊరుకోదు అన్న కనీస విజ్జత లేకుండా సర్కారు ప్రవర్తించింది. ఎందుకంటే ప్రజల పన్నుల ద్వారా సమకూరిన ఆదాయాన్ని ఒక పార్టీ ప్రచారానికి వాడుకోవడానికి ఈ సమాజం గాని, రాజ్యాంగం గాని ఒప్పుకోదు. ఆ విషయం పట్టించుకోకుండా రంగులు వేశారు. 

దీంతో పలువురు దీనిపై కోర్టులో పిటిషను వేయగా... వెంటనే ఆ రంగులు తొలగించండి, ఆ రంగులు తొలగించేదాకా స్థానిక ఎన్నికలు పెట్టడానికి వీలులేదని ఆదేశించింది. దీనిపై ఏపీ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడా తప్పు పట్టి పంపించింది కోర్టు. ఇక తప్పనసరి పరిస్థితుల్లో ఏపీ హైకోర్టులోనే తమకు 3 నెలల టైం కావాలని కోర్టును సర్కారు కోరింది. సరే 3 నెలలు ఇస్తాం. కానీ అంతవరకు ఎన్నికలు ఆపుతారా? అని అడిగింది. ఈ ప్రశ్నకు జగన్ సర్కారుకు దిమ్మతిరిగింది. ప్రభుత్వ న్యాయవాదికి సమాధానం తోచని పరిస్థితి. దీంతో చివరకు వాయిదా తీసుకుని మరసటి విచారణలో మూడు వారాల సమయం కోరింది. కానీ అప్పటికి బుద్ధి పోనిచ్చుకోని సర్కారు 3 రంగులకు బీజేపీ రంగు అయినా కాషాయాన్ని కలిపి వేసింది. దీంతో మళ్లీ పాత పిటిషనర్లు దీనిపై కోర్టుకు పోయారు. కొత్త జీవో కూడా రాజ్యాంగానికి విరుద్ధమని పిటిషనర్లు చేసిన వ్యాఖ్యలతో ఏకీభవించిన హైకోర్టు ఆ జీవోను రద్దు చేసింది. అంటే మళ్లీ 500 కోట్లు వేస్టయ్యాయి. ఇప్పటికే నాలుగు రంగులు వేసినవి కూాడా తొలగించి మళ్లీ పార్టీ రంగులు లేకుండా పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయాల్సి ఉంది. దీనిపై తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా వేసింది.