షాక్: జగన్ సర్కారకు చెంపదెబ్బ- ఆ జీవో రద్దు !!

August 04, 2020

ఏపీ సర్కారుకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడు వారాల్లో పంచాయతీ ఆఫీసులకు వేసిన వైసీపీ రంగులు తొలగించమని పార్టీయేతర రంగులు వేయమని చెబితే దానికి బీజేపీ రంగు కలిపి వేసిన జగన్ పై హైకోర్టు సీరియస్ అయ్యింది. గవర్నమెంటు కోర్టు దిక్కారానికి పాల్పడిందని పేర్కొంటూ జీవో 623ను రద్దు చేసింది.

సుమోటోగా ఈ కేసును స్వీకరించిన హై కోర్టు సీఎస్, ఈసీ, పంచాయతీ కార్యదర్శిల నుంచి వివరణ కోరింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇది కోర్టు దిక్కారమే అని ఆగ్రహించింది. ఇక పోతే ఈ రంగుల మార్పు జీవోను గత నెల అంటే ఏప్రిల్ 23న ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. మే 5వ తేదీన ఆ జీవోను సస్పెండ్ చేసిన కోర్టు తాజాగా ఇపుడు దానిని రద్దు చేసింది.