ఏపీ సర్కారుకి తాజా భారీ షాక్ 

August 05, 2020

తాను దేశంలోనే అత్యధిక ఎమ్మెల్యేలున్న వ్యక్తిని కాబట్టి, ఎక్కువ మెజారిటీతో గెలిచిన ముఖ్యమంత్రిని కాబట్టి ఇతర ముఖ్యమంత్రుల కంటే తనకు ఎక్కువ అధికారాలు దఖలుపడతాయన్న ధోరణిలో ఉన్నట్టు కనిపిస్తారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగంతో సంబంధం లేకుండా తనకు నచ్చిందల్లా జరగాలనుకుంటారు.

కోర్టులు  అడ్డుపడితే అసలు నేను ప్రజలు ఓటేస్తే గెలిచాక వాటికేం పని అన్నట్లు ఆశ్చర్యపోతుంటారు. ఆయన అనుచరులు ఎడాపెడా కోర్టులను తిట్టేసి ముఖ్యమంత్రి గారిని అడ్డంగా సుప్రీంకోర్టులో ఇరికించేశారు.

ఇదే ధోరణి వల్ల తాజాగా మరోసారి జగన్ రెడ్డి హైకోర్టు చేతిలో ఎదురుదెబ్బ తిన్నారు. ​

చిత్తూరు జిల్లాలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా ఇన్ ప్రా సంస్ధ భూములు ఇటీవల ఏపీ ప్రభుత్వం వెనక్కు తీసుకుంటూ జీవో జారీ చేసింది.

ఆ హక్కు ప్రభుత్వానికి లేదంటూ అమర్ రాజా కంపెనీ కోర్టుకు వెళ్లింది. ఈ పిటిషను విచారించిన కోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే విధించింది. 

 

2009లో అప్పటి సీఎం రోశయ్య హయాంలో మాజీ మంత్రి గల్లా అరుణకుమార్ కుటుంబానికి చెందిన అమర్ రాజా ఇన్ ఫ్రా సంస్ధకు 483.27 ఎకరాల భూమిని డిజిటల్ వరల్డ్ సిటీ నిర్మాణం కోసం అని ప్రభుత్వం ఆ కంపెనీకి కేటాయించింది.

కాంట్రాక్టు నిబందనల ప్రకారం ఉద్యోగాలు కల్పించలేదు అన్న కారణంతో ఈ భూమిలో 253.61 ఎకరాలను వెనక్కి తీసుకుంటున్నట్లు తాజాగా ఏపీ పరిశ్రమల శాఖ జీవో ఇచ్చింది. 

అయితే, ప్రభుత్వానికి ఆ అధికారం ఎందుకు లేదో వివరిస్తూ... ప్రభుత్వ జీవోను ఆపాలంటూ అమర్ రాజా కోర్టు కు వెళ్లింది. ఇరువురి వాదనలను విన్న కోర్టు ప్రభుత్వ జీవోపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.