జగన్ కి ఘాటు దెబ్బ... అది కూడా ఈరోజు మరింత షాక్

August 15, 2020

కోర్టులు కాదు కదా... ఆ దేవుడు అడ్డు వచ్చినా తాను అనుకున్నది జరగాలనుకునే వ్యక్తిత్వం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ది. అందుకే కోర్టులు చెప్పినా పట్టించుకోకుండా ఇంగ్లిష్ మీడియంపై ఎంత మొండిగా ముందుకు పోయారో తెలిసిందే. తెలుగు మీడియం ఉండాల్సిందే అని కోర్టు చెప్పినా... కేవలం ఇంగ్లిష్ మీడియం మాత్రమే పెడుతూ కొత్త జీవో తెచ్చారు జగన్. 

తాజాగా మరోదెబ్బ తగిలింది జగన్ రెడ్డికి. రాజధాని కడతాం అంటూ ప్రభుత్వం తీసుకున్న భూములను పేదలకు ఇవ్వడానికి జగన్ రెడ్డి ఇచ్చిన జీవోను హైకోర్టు నాలుగు వారాలు సస్పెండ్ చేసింది. ఇటీవల ఏపీ సర్కారు అమరావతి మాస్టర్ ప్లాన్లో మార్పులు చేస్తూ... ఒక జీవో ఇచ్చింది. ఇది అమరావతి మాస్టర్ ప్లాన్లో ఉన్న 4 నివాస జోన్లకి 5వది యాడ్ చేసింది. ఇందులో కృష్ణాయ పాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 967 ఎకరాలను ఈ జోన్లోకి తెచ్చి పేదలకు భూములు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిని జోన్ 5 గా పేర్కొంది.

అయితే... ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సస్పెండ్ చేసింది. అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించి తమ వాదనలు వినిపించారు. ఇది తమకు ఇచ్చిన అగ్రిమెంట్ కు విరుద్ధంగా ఉందన్నారు. చట్టం అతిక్రమించి అగ్రిమెంట్ కి విరుద్ధంగా ఇచ్చిన ఈ జీవోను రద్దు చేయాలని వారు కోర్టును కోరగా కోర్టు తాత్కాలికంగా సస్పెండ్ చేసి విచారణ వాయిదావేసింది. దీంతో జగన్ సర్కారుకు మరో దెబ్బ పడినట్లయ్యింది.