హైకోర్టు ప్రశ్నకు జగన్ కి దిమ్మతిరిగిండ్లా... 

June 01, 2020

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ రంగుల వ్యవహారం దేశ వ్యాప్తంగా ఎంత వైరల్ అయ్యిందో మనం చూశాం. పంచాయతీ భవనాలతో మొదలుపెట్టి... జాతీయ జెండా వరకు దేన్నీ వదలకుండా రంగులు వేసింది ఏపీ సర్కారు. కొన్ని చోట్ల అయితే శ్మశానాలకు కూడా వదల్లేదు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చినా వైసీపీ నేతలు ఖాతరు చేయలేదు. పట్టిసీమ ప్రాజెక్టుకు ఖర్చయినంత డబ్బు పనికిరాని రంగులకు కేటాయించారు. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ భవనాలకు ఒక పార్టీ రంగులు వేయకూడదు. కానీ రాజ్యాంగం గురించి తెలిస్తే వాళ్లు ఇలా చేసేవాళ్లు కాదు కదా. అందుకే తమ మానాన తాము వేసుకుంటూ పోయారు.చివరకు రంగుల వ్యవహారం హైకోర్టుకు చేరింది. చాలా మంది సామాన్యులు, ప్రతిపక్ష పార్టీలు కోర్టుకు వెళ్లాయి. దీనిని సీరియస్ గా పరిగణించిన హై కోర్టు ఎన్నికలకంటే ముందే రంగులు తొలగించి ఆ ఆధారాలు తమకు సమర్పించాలని ఆదేశించింది. దీనిని పట్టించుకోని జగన్ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లింది. హైకోర్టును సమర్థించిన సుప్రీంకోర్టు ఇది అక్కడే తేల్చుకోవాలని సూచించింది. ఇక చేసేది లేక జగన్ సర్కారు తమకు రంగులు మార్చడానికి తగినంత సమయం కావాలంటూ కోర్టుకు విన్నవించింది. ఈ సందర్బంగా హైకోర్టు వేసిన ప్రశ్నలకు  జగన్ బృందానికి దిమ్మతిరిగింది. సరే మీకు మూడు నెలల టైం ఇస్తాం. మరి అంతవరకు ఎన్నికలు ఆపుతారా అని అడిగింది. ఈ ప్రశ్నను ఊహించని ప్రభుత్వ న్యాయవాది... ప్రభుత్వాన్ని సంప్రదించి ఎంత తక్కువ సమయంలో రంగులు మార్చగలరో చెబుతాం అని కోర్టుకు విన్నవించారు. మూడు నెలల సమయం అడగడంలో ఉద్దేశం ఏంటో కోర్టుకు అర్థం కాదనుకున్న జగన్ బ్యాచ్ కి కోర్టే రివర్స్ లో మైండ్ బ్లాక్ చేసింది. తప్పును సరిదిద్దుకోమని చెబితే ఇంత యాగీ చేస్తున్న సర్కారు తీరుపై జనంలో అసహనం వ్యక్తమవుతోంది.