AP: రెడ్డి జోన్ ని రెడ్ జోన్ గా మార్చిన మోడీ

August 13, 2020

విపరీతమైన బంధప్రీతి, రాజకీయ పక్షపాతం, పదవులతో కులాభిషేకం... వీటితో ఏపీ కొందరి దృష్టిలో అలరారిపోతోంది. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి రోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ... ఇలా ఎవరినీ వదలకుండా అందరి పదవులు ఊడగొట్టి ప్రతి కీలక పదవిలో రెడ్డి కులస్తుడిని కూర్చోబెట్టారు జగన్. ఎంత మంది ఎన్ని విమర్శలు చేసినా ఖాతరు చేయలేదు సరికదా... ఇంకా తాను ప్రతిరోజు రెడ్లకు పదవులు ఇస్తూ ఇతరులకు కులపిచ్చి అంటూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇతరులకు కులపిచ్చి అని సోషల్ మీడియాలో ప్రచారం చేసే ప్రతి ఒక్క నెటిజన్ ఈ రెడ్డి తోకను తగలించుకున్న జగన్ ఫాలోయరే. తాను అన్ని తప్పులు చేస్తూ, అబద్ధాలు చెబుతూ కూడా ఎదుటి వారిని తీవ్రంగా దూషించగలిగిన ఆత్మవిశ్వాసం జగన్ అండ్ బ్యాచ్ ది. ఇలా ఇప్పటివరకు సుమారు 500 లకు పైగా కీలక పోస్టుల్లో రెడ్డి కులస్థులను కూర్చోపెట్టి ఏపీని రెడ్డి జోన్ గా మార్చారు జగన్.

 

జగన్ ఒకటి తలిస్తే... ప్రకృతి మరొకటి తలంచింది. జగన్ ఏపీని రెడ్డి జోన్ చేస్తే... ప్రకృతి దానిని ’రెడ్ జోన్‘ గా చేసింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మ్యాప్ లో ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం మినహాయి మిగతా ప్రాంతం అంతా రెడ్ జోనే. ఇందులో కొంత క్రెడిట్ జగన్ కే దక్కుతుంది. అందులో సందేహం లేదు. ఎందుకంటే ప్రపంచమంతా కరోనా ప్రభావంతో అతలాకుతలం అయిపోతున్న సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ దాని గురించి ఒక్క మీటింగ్ పెట్టలేదు. ఒక్క క్షణం ఆలోచించలేదు. ఫలితంగా చాపకింద నీరులా కరోనా ఏపీలోకి వచ్చేసింది. ఏపీలోకి వచ్చాక 10 రోజుల తర్వాత గాని అది ఉందని ఒప్పుకోవడానికి ఇష్టపడక పోగా... ఎన్నికలు పెట్టి ఏకంగా ఏపీని కరోనాకు బలిచేసే ప్రయత్నం చేసింది ఏపీ సర్కారు. ఉద్దేశపూర్వకంగా చేయకపోవచ్చు గానీ ప్రజల ప్రాణాల కంటే రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఏపీలో కరోనా వ్యాప్తికి కారణమైంది జగన్ సర్కారు.

ఒకప్పుడు కేవలం 10 కేసులే ఉన్నాయి మా దగ్గర. దేశంలోనే తక్కువ అని సంకలు గుద్దుకున్న మూడు రోజులకే కరోనా ఏపీలో విలయతాండవం మొదలుపెట్టింది. ఒక్కసారి జూమ్ అంటూ పెరిగిపోయింది. ఇపుడు దేశంలోనే టాప్ 10లో ఉంది ఏపీ. అంతేగాకుండా ఏపీ ర్యాంకు రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికి సుమారు 600 కు చేరాయి ఏపీ కేసులు. దీంతో దేశంలో అత్యధిక ప్రదేశం రోడ్ జోన్లో ఉన్న ఏపీ నిలబడింది. కేవలం పైనున్న రెండు జిల్లాలు మినహా మిగతా 11 జిల్లాలు ఏపీలో రెడ్ జోనే.  దేశం మొత్తం మ్యాప్ చూసినపుడు ... ఏపీని జగన్ రెడ్డి జోన్ గా మారిస్తే, కరోనా రెడ్ జోన్ గా మార్చిందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇది కాలమహిమ కాదు... ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రజలు చెల్లించుకుంటున్న మూల్యం.