డామిట్... కథ అడ్డం తిరిగింది

August 07, 2020

అనుకున్నంతా అయ్యింది. కరోనా విజృంభించింది. తన విశ్వరూపాన్ని చూపింది. తెలంగాణలో కరోనా మొదలైనప్పటి నుంచి ఇంతవరకు అత్యధిక కేసులు నమోదవడంతో కొత్త కరోనా రికార్డు తెలంగాణలో నమోదైంది. 

ఈ రోజు నమోదైన కేసులు జిల్లాల వారీగా...

GHMC - 122 కేసులు

రంగారెడ్డి - 40 

మహబూబ్ నగర్ - 3

సూర్యపేట - 1

నిర్మల్ - 1

వరంగల్ అర్బన్ -2

యాదాద్రి - 1

మేడ్చల్ - 10

జగిత్యాల్ - 3

మెదక్ - 3

ఖమ్మం - 9

జనగాం - 1

మొత్తం కేసులు - 196

(తెలంగాణ లోకల్- 196  + వలస కూలీలు - 3 )

లాక్ డౌన్ లో సడలింపులు పెరుగుతున్న కొద్దీ తెలంగాణలో కేసలు పెరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ నిన్ననే ప్రజలకు ఒక విజ్జప్తి చేశారు. మీ సహకారం లేకుంటే ప్రభుత్వం ఏ లక్ష్యమూ సాధించలేదు. దయచేసి సహకరించండి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించండి. వ్యాప్తి జరగకుండా చూడండి. మాస్కు, భౌతిక దూరం తప్పనసరి అంటూ పేర్కొన్నారు.

ప్రభుత్వాలు చేతులు ఎత్తేశాయి. ప్రజలు ఇక తమను తాము రక్షించుకోవాలి. ప్రభుత్వాలు ప్రజలను కాపాడే స్థితిలో లేవు. కొంతకాలం ఆగితే వైద్యం కూడా అందరికీ అందుబాటులో ఉండని పరిస్థితి. కాబట్టి ముఖ్యంగా పిల్లలను, పెద్దలను కాపాడుకోండి. అలాగో ఇతర వ్యాధులున్నవారు జాగ్రత్తగా ఉండి.

=============================

నమస్తేఆంధ్ర నినాదం - బ్యాన్ చైనా ప్రొడక్ట్స్, బ్యాన్ చైనా యాప్స్

===============================