కేసీఆర్, కేటీఆర్‌కే కాదు హిమాన్షు కూడా వారికి సారే !!

July 09, 2020

కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు అయిన హిమాన్షు మరోసారి వార్తల్లోకెక్కాడు. ఆయన కేసీఆర్ కేబినెట్లోని మంత్రిని ఇంటర్వ్యూ చేయడం చర్చనీయమవుతోంది. స్కూల్ ప్రాజెక్టు కోసం ఈ ఇంటర్వ్యూ చేశానంటూ హిమాన్షు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించాడు. కేహెచ్‌ఆర్666 పేరుతో ఉన్న ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మంత్రిని ఇంటర్య్యూ చేస్తున్న ఫొటో పెట్టి ఈ సంగతి పంచుకున్నారు.
స్కూల్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టాపిక్ కూడా బాలల సంక్షేమం కావడం..సత్యవతి రాథోడ్‌ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కావడంతో హిమాన్షు ఈ ఇంటర్వ్యూ చేశారు. అయితే ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో, మిగిలిన వివరాలను హిమాన్షు వెల్లడించలేదు.
మంత్రిని ఇంటర్వ్యూ చేసిన హిమాన్షు భవిష్యత్తులో తాత, తండ్రిలా రాణిస్తారని కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం తెలంగాణ ప్రజలే కాదు చివరకు మంత్రులను కూడా కేసీఆర్ జేబులో బొమ్మల్లా చేసి ఆడిస్తోందని... కాకపోతే మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ఒక స్కూలు పిల్లాడు తన ప్రాజెక్టు కోసం ఇంటర్వ్యూ చేయడమేంటని.. కేసీఆర్ మనవడు కాకుండా ఇంకెవరైనా స్కూలు పిల్లాడు ఇంటర్వ్యూ చేస్తామంటే ఈ మంత్రులు ఓకే చెప్తారా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. కేసీఆర్, కేటీఆరే కాదు హిమాన్షు కూడా మంత్రులున ప్రశ్నిస్తే వారు సమాధానాలు చెప్పాలన్నమాట అంటూ మండిపడుతున్నారు.