జగన్... అక్కడ గుళ్లు కట్టించు

June 01, 2020

తనంతట తాను క్రిస్టియన్ అని ప్రకటించుకున్న ముఖ్యమంత్రి జగన్ కు తిరుమల ఆలయ భూముల అమ్మకంతో భక్తుల మనోభావాలు ఎలా దెబ్బతింటాయో అర్థం కానట్టుంది. తమిళనాడులో ఉన్న భూములన్నీ అమ్మడం అనే ఆలోచనే శాస్త్ర విరుద్ధం అంటున్నారు భక్తులు.

చర్చిలు నిర్మించడానికి ప్రజల ధనాన్ని నిరభ్యంతరంగా ఖర్చుపెట్టిన ముఖ్యమంత్రి గారు అదే చేత్తో తిరుమల భూముల్లో ఆలయాలు కట్టించాలని అంటున్నారు. పరమత సహనం కలిగిన ముఖ్యమంత్రిగా అన్ని మతాలను ఉద్దరించాలని భక్తులు కోరుతున్నారు.

డబ్బుల కోసం తిరుమల ఆస్తులు తగ్గించుకుంటూ పోవడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇది కచ్చితంగా దురాలోచన. దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు అంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం భూములు అమ్మడం అంటే అది స్థలాలు అమ్మడం కాదని... భక్తుల నమ్మకాన్ని అమ్మడం అని, హిందూ ధర్మ విస్తరణను అడ్డుకోవడం అని అంటున్నారు.