హోం శాఖ ఆపరేషన్ సక్సెస్ - అందరినీ పట్టేశారు

August 13, 2020

తబ్లిగి భయానికి చాలావరకు తెరపడినట్లు తెలుస్తోంది. రాష్ట్రాలతో కలిసి నిర్వహించిన పెద్ద ఆపరేషన్ లో తబ్లిగికి హాజరైన వారిని అందరినీ పట్టుకున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. వీరి సంఖ్య 9 వేలు ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. 

మర్కజ్ మజీద్ లో నిర్వహించిన తబ్లిగి జమాత్ లో భాగంగా పలువురు కరోనా సోకిన విదేశీయులు పాల్గొనడంతో వారి ద్వారా వందలాది మందికి సోకినట్లు రెండ్రోజుల క్రితం బయటకు వచ్చింది. దీంతో దేశంలో కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. దీంతో దీనిని చాలా సీరియస్ గా తీసుకున్న కేంద్రం దీని చేదించి తీరాలని భారీ  ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో ఆర్మీతో పాటు స్థానిక పోలీసులను రంగంలోకి దింపింది. ఈ ఆపరేషన్లో భాగంగా 9000 మందిని గుర్తించారు. లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిని ఆస్పత్రికి, లక్షణాలు లేని వారిని క్వారంటైన్ కి తరలించారు. అందరికీ పరీక్షలు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

ఈ ప్రకటనలో కేంద్రం ఏం చెప్పిందంటే... ‘‘భారీ ప్రయత్నంతో తబ్లిగ్ జమాత్ నిర్వహించిన సదస్సుకు హాజరైన వారితో పాటు వారిని కాంటాక్ట్ అయిన 9000 మందిని గుర్తించాం’’ అని కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ వాస్తవ వెల్లడించారు. ఇదిలా ఉండగా గుర్తించిన వారిలో 1306 మంది విదేశీయులట.  మిగతా వారంతా భారత్ లోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు. 

ఢిల్లీ సదస్సుకు అక్రమంగా హాజరైన  విదేశీయుల సమాచారాన్ని సేకరించిన కేంద్ర ప్రభుత్వం.. ఆ వివరాలను ఆయా దేశాలకు అందించింది. ఆ 960 మందినీ బ్లాక్ లిస్టులో చేర్చింది. వీసాలు రద్దుచేసింది. వారందరిపై కేసులు నమోదు చేయనున్నారు. ప్రస్తుతం వీరు ప్రభుత్వ అదుపులో ఉన్నారు. వీరిని 1946 ఫారినర్స్ యాక్ట్ ప్రకారం శిక్షించనున్నారు.