చేత కాని ఆంధ్రుడు 

February 22, 2020
KCR: ఆంధ్రోడి మీద పగ సాధించాలి పక్క రాష్ట్రం నాశనం ఐతే నా రాష్ట్రం బాగుపడిద్ది అనుకున్నాడు తప్పులేదు.
 
Modi: 2002 లో, 2013 లో తనని తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబుని దెబ్బ కొట్టాలి. సొంత రాష్ట్రానికి పోటీ తొలిగిపోవాలి. కలల నగరం ధొలేరాని మించిన నగరం తను బతికి ఉండగా మరొకటి రాకూడదు. 
 
BJP: ఆంధ్రా లో మత రాజకీయం పని చెయ్యదు ఎందుకంటే ఇక్కడ కేవలం 2.7% మాత్రమే ముస్లిం జనాభా. రెండు ప్రాంతీయ పార్టీ లు బలంగా ఉన్న చోట మత ప్రాతిపదిక లేకుండా తను బలపడాలి అంటే ఏకైక మార్గం రాష్ట్రం రావణ కాష్టం కావాలి. ప్రజలు ఏదో ఒక పార్టీ మీద విరక్తి కలిగి మీరే దిక్కు అనుకునే దాక రావాలి.

అప్పటి దాక గోడ మీద ఎక్కి చూస్తా ఉంటుంది.  

JANASENA: అసలు పార్టీ ఎందుకు పెట్టామో, మన సిద్దాంతం ఏంటో, ఎవరిని ఎప్పుడు ఎందుకు ఏ కారణం తో, ఎలా తిడతామో, ఎవరితో ఎందుకు కలుస్తామో, ఎందుకు విడిపోతామో, అసలు మనకి కావాల్సింది ఏమిటో, ఎవరు మిత్రులో, ఎవరు శత్రువులో అనేది అభిమాని, క్రింది స్థాయి కార్యకర్త నుండి పార్టీ అద్యక్ష్యుడి దాక ఎవ్వరికీ అర్ధం కాని, క్లారిటీ లేని ఒక అయ్యోమయం పార్టీ ... వాళ్ళు చెయ్య గలిగిందీ, చేసేదీ ఏమీ లేదు.

CPM, CPI : రాయటానికి నా సమయం..!  
 
తెలుగుదేశం:ఒక ఉద్యమంగా మొదలయ్యి, తెలుగు పౌరుషాన్ని రగిలింప చేసి, ఆత్మగౌరవాన్ని తట్టి లేపి. డిల్లీ పీఠాన్నే గడగడలాడించి, రాజకీయాన్ని పేద, బడుగుల వాకిటికి చేర్చి, దేశంలో రాజకియ్య- సంక్షేమ విధానాలనే మార్చేసి, ప్రజా నాలుకగా, అత్యంత ఉత్తేజ వంతం గా నడిచిన పార్టీ కాల క్రమేణా తేజస్సునీ, ప్రజలతో భావోద్వేగ సంబందాలకు దూరమై, రాష్ట్రం కోసం, భవిషత్తు తరాల కోసం నిరంతరం శ్రమించే ఒక్క అధినేత తప్ప ప్రభుత్వానికీ - పార్టీ కీ, నాయకులకీ - కార్యకర్తలకీ, నేతలకీ - ప్రజలకీ సంబంధాలు  లేని పార్టీ గా మిగిలిపోయి. చేసిన ప్రగతి ని కూడా ప్రజలకి వివరించలేని అచేతన స్థితి లో చిత్తుగా ఓడిన పార్టీ. ఎంతో చెయ్యాలనుకున్నా ఏమీ చెయ్యలేని స్థితి.
 
YSRCP: పదవి అంటే వారసత్వపు హక్కు. కావాలి అనుకున్న దాన్ని అడ్డం వచ్చిన వాడిని చంపైనా లాక్కునే స్వభావం ఉన్న కుటుంబం  నుండి వచ్చిన వ్యక్తి పదవి ఇవ్వలేదని కోపంతో, కేవలం పదవే అంతిమ లక్ష్యం గా పెట్టిన పార్టీ. ఆంద్ర రాష్ట్రం లో మా కులమే ఎన్నటికీ అదికారంలో ఉండాలి, అదిమా హక్కు అని మనస్పూర్తిగా నమ్మే ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న 'రెడ్డి' కులం, 'క్రీస్తు' ఒక్కడే దేవుడూ మిగిలిన వాళ్ళు సైతానులు అని బలంగా నమ్మే క్రైస్తవుల మద్దతు తో నడిచే పార్టీ. సిద్దాంతపు పునాదే లేని పార్టీ.

డబ్బులిస్తే మొగుడూ పెళ్ళాల మద్య చిచ్చు పెట్టి, కాపురాలు కూల్చడానికి కూడా వెనుకాడని ఆదునిక రావు గోపాల్రావ్ లాంటి ప్రషాంత్ కిషోర్ తో, పదవే అంతిమ లక్ష్యం ఐన YCP జత కలిసి ఆంధ్రా సమాజంలో సంక్లిష్టతలని  వాడుకుని  ఆంధ్రా సమాజాన్ని కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా విభజించి, ఒకళ్ళ మీద ఒకళ్ళను ఉసిగిల్పి ఈరోజు రాష్ట్రాన్ని ఇక్కడదాక తీసుకొచ్చారు
 
ఈ మొత్తం కధలో కొంత మంది పాత్ర ధారులు ఐనా, సూత్రధారులు మాత్రం పక్క రాష్ట్రం లో, డిల్లీ లోనే ఉన్నారు. జగన్ రెడ్డి తనని గెలిపించిన సూత్రదారుల కోరిక తీర్చక తప్పదు అసలే మాట తప్పని వంశం.చంద్రబాబు ఊడగొట్టిన నాగలి లెక్క పొదును ఉన్నా అరకకి పనికి రాదు. ఈ పతనానికి ఆంధ్రా ప్రజల అతి తెలివి, మూర్కత్వం, కుల గజ్జి ఎంత కారణమో, అధికారం లో ఉండి కూడా జరుగుతున్న కుట్రలు, విష ప్రచారాన్ని చేదించలేని, ప్రజలకు వివరించలేని తెలుగుదేశం చేతకాని తనం కూడా అంతే కారణం. సమర్ధుడి మౌనం సమాజానికి ప్రమాధం అంటే ఉదాహరణే తెలుగుదేశం చేతగాని తనం, నిర్లిప్తత ఇప్పుడు ఆంద్ర రాష్ట్ర భవిషత్తుని నాశనం చేసింది.ఎవరు ఏమి చెయ్యగలరో అదే చేశారు, చేస్తున్నారు ఒక్క ప్రజలూ, తెలుగుదేశం తప్ప. నా ధృష్టి లో దోషులు మాత్రం 60% ప్రజలు, తెలుగుదేశం మాత్రమే.
 
స్వస్తి-
బాధతో చేత కాని ఆంద్రుడు - రాజేష్ కుమార్ తాళ్ళూరి

 

RELATED ARTICLES

  • No related artciles found