అమితాబ్ కి కరోనా ఎలా సోకిందో తెలుసా?

August 10, 2020

అమితాబ్ కి కరోనా రావడం అనే వార్త కంటే... అమితాబ్ కి కరోనా ఎలా సోకిందన్న ప్రశ్నే ఎక్కువ మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే కరోనా సోకడం ఇపుడు వార్త కాదు.... సెలబ్రిటీలకు ఎలా సోకుతోంది, వాళ్లే జాగ్రత్తగా ఉండలేకపోతే ఇక సామాన్యులు ఎలా జాగ్రత్తగా ఉండగలరు? అనేది ఇక్కడ మూల ప్రశ్న.

77 ఏళ్ల అమితాబ్ కు ఇప్పటికే ఇతర వ్యాధులున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన జాగ్రత్తగా లేకపోతే ఎలా అని అందరూ అంటున్నారు. నిజమే అమితాబ్ బచ్చన్ ఇప్పటికే పలు ఇతర అనారోగ్య పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నారు. 1982లో కూలీ సినిమా షూటింగ్స్ లో ఒకసారి ప్రమాదానికి గురయ్యారు. ఆపరేషన్ అయ్యింది. కాలేయ సమస్యలు కూడా ఉన్నాయి. 

తాజాగా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని.. వారం క్రితం డాక్టర్లకు చెబితే ఆయనకు చికిత్స చేశారు. కానీ అపుడు కరోనా టెస్టు చేయలేదు. తర్వాత వారం రోజులకు అనుమాంతోకరోనా టెస్టు చేయగా ఉందని తేలింది. మరి ఆయనకు ఎలా సోకిందన్నది ఆరా తీస్తే ... అమితాబ్ నిర్లక్ష్యమే అని తేలింది.

లాక్ డౌన్ పెట్టినప్పటి నుంచి ఇంట్లోనే ఉన్న అమితాబ్ ఇటీవల కౌన్ బనేగా క్రోర్‌పతి షో ఆడిషన్స్ కోసం ముంబైలోని ఒక స్టూడియోకు వెళ్లారట. అక్కడ కొద్దిసేపు మాస్కు కూడా పెట్టుకోలేదట. అక్కడే కరోనా సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.

కోమార్బిడ్స్ (ఇతర వ్యాధులు) ఉన్న వ్యక్తి 77 ఏళ్లలో షూటింగ్ కు వెళ్లడం తప్పు కదా. ఆయన నిర్లక్ష్యం వల్ల ఆయన కుటుంబానికి సోకింది. ఇంకా ఈయనను కలిసిన వారికి కూడా సోకి ఉంటుంది కదా. ఇంకా ఎంత కాలం ఈ తాపత్రయం. ఆయన ఈ వయసులో నటించడం తప్పు కాదు. కానీ ఇలాంటి సమయంలో బయటకు వచ్చి నిబంధనలు ఉల్లంఘించడం తప్పు. దానికి ఆయనతో పాటు పలువురికి శిక్ష పడింది. చిన్నారి ఆరాధ్యకు ఆయన వల్ల ముప్పు వచ్చింది..