మోడీ వచ్చాడు.. చెత్త మార్పు తెచ్చాడు

June 01, 2020
CTYPE html>
మోడీ వస్తేనే మార్పు వస్తుందంటూ గత ఎన్నికల టైమ్ లో భారతీయ జనతా పార్టీ ఊదరగొట్టింది. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ లేని భారత్ అంటూ మోడీ కూడా అదరగొట్టారు. మొత్తానికి ప్రధాని అయిపోయారు. ఐదేళ్లు గడిచాయి. మరి మోడీ చెప్పిన మార్పు వచ్చిందా..? పేదల బతుకులు బాగుపడ్డాయా? మంచి మార్పు సంగతేమో కానీ మోడీ వచ్చిన తర్వాత కోరుకొని మార్పులు మాత్రం చాలానే వచ్చాయి. ఈ ఐదేళ్లలో ఎన్నో విపరీతాలు చోటుచేసుకున్నాయి.
 
45 ఏళ్లలో ఎన్నడూ చూడనంత నిరుద్యోగతను ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటోంది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం చూస్తే..  ప్రపంచవ్యాప్తంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న నగరాల్లో, మొదటి 10 నగరాలు ఇండియాలోనే ఉన్నాయి. ఈ ఐదేళ్లలో అమరులైన జవాన్ల సంఖ్య... ఈ 30 ఏళ్లలో ఎన్నడూ జరగలేదు. వాషింగ్టన్ పోస్ట్ ఈ విషయాన్ని నిర్థారించింది. ఇక క్రెడిట్ సాస్ రిపోర్ట్ ఆధారంగా చూసుకుంటే.. దేశంలో ఇప్పుడున్నంత ఆర్థిక అసమానత ఈ 80 ఏళ్లలో ఎప్పుడూ కనిపించలేదు. 
 
అంతేకాదు రాయిటర్స్ సర్వే ప్రకారం.. మహిళల భద్రతా కోణంలో ఇండియా అత్యంత చెత్త దేశంగా పేరుగాంచింది. ఇవి మాత్రమే కాదు, ఈ పదేళ్లలో కాశ్మీరు యువత ఎప్పుడూ వెళ్లనంతగా ఉగ్రవాదంవైపు మళ్లింది. మార్కెట్ డేటా ప్రకారం, మారకపు విలువ ఆధారంగా చూసుకుంటే ఆసియాలోనే అత్యంత చెత్తదేశంగా భారత్ తయారైంది. 
 
ఇలా ఒకటి కాదు.. చెప్పుకుంటూ పోతే చాలానే అవ్యవస్థలు తయారయ్యాయి. పర్యావరణ పరిరక్షణలో ఫెయిల్ అయిన మూడో దేశంగా నిలిచింది. దేశంలోనే తొలిసారిగా సుప్రీంకోర్టులో గొడవలు రావడం, ప్రభుత్వాలతో సుప్రీంకోర్టుకు తగాదాలు రావడం, రాజ్యాంగ సమస్యలు తలెత్తడం, సీబీఐ రోడ్డున పడడం.. ఇలా అన్నీ మోడీ హయాంలోనే చూస్తున్నాం. హైవేల నిర్మాణం, విద్యుదీకరణ, ఉజ్వల యోజన, సులభతర వాణిజ్యం వంటి అంశాల్లో మోడీ పాలన బాగున్నప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో భారత్ పరువు తీసిన ప్రధానిగా మాత్రం మోడీ నిలిచిపోతారు.