జగన్ ఏం చేస్తున్నాడో తెలుసా?

July 01, 2020

వేపాకు చేదుగా ఉంటుంది కానీ చెడ్డది కాదు.
అజ్జాని అది చేదుగా ఉంటుంది తినలేం అని చెప్తాడు. నిజమే.
జ్జాని దానివల్ల ఎన్ని ఉపయోగలున్నాయో చెప్పి కష్టమైనా తినమంటాడు. ఇదీ నిజమే.
ఆ ఇద్దరు ఎవరో ఏపీ ప్రజలకు బాగా అర్థమై ఉంటుంది.
ఇపుడు ఏపీ ప్రభుత్వం చేసే పనులన్నీ గందరగోళంగా ఉన్నాయి. సింగపూర్ విమానానికి చంద్రబాబు ప్రభుత్వ డబ్బులు ఉద్దరగా ఇచ్చారు అని జగన్ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. దేశాలు రాష్ట్రాలు కంపెనీలకు ఎందుకు ప్రోత్సాహకాలు ఇస్తాయో అర్థమైన వాళ్లు ఇలాంటి మాటలు మాట్లాడరు. అసలు ఈరోజు హోదా ఎందుకు అడుగుతున్నాం. కంపెనీలకు అనేక రాయితీలు దక్కుతాయని. అరే డబ్బులు సంపాదించుకునేవాడు వ్యాపారం చేసుకోవడానికి డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నిస్తామా? ప్రశ్నించం. ఎందుకంటే... ఒక కంపెనీ వస్తే కేవలం ఓనరుకు లాభం రావడం మాత్రమే కాదు. కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగుల వల్ల చుట్టుపక్కల దుకాణాలు వస్తాయి. హోటళ్లు వస్తాయి. మావన వనరల అవసరాలు తీర్చడానికి అనేక చిన్న వ్యాపారాలు వెలుస్తాయి. ఇంత మంది కలిసి రాష్ట్రానికి పన్నులు కడుతారు. కంపెనీ పన్నులు కడుతుంది. ప్రజల చేతులో డబ్బులు ఆడుతాయి. క్రమంగా ఆ ప్రాంతంలో ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది. సంపద సృష్టి జరుగుతుంది.
చంద్రబాబు చేసింది ఇదే. కేంద్రం హోదా ఇచ్చే దాకా చూస్తూ ఊరుకోలేదు. తన ప్రభుత్వానికి చేతనయిన స్థాయిలో వసతలు కల్పించారు. రవాణా సదుపాయాలు, భూమి, ఆర్థిక ప్రోత్సహకాలు లేదా రాయితీలు ఇలాంటి ఉంటేనే కంపెనీలు వస్తాయి. అందుకే దేశ రాజధానికి, ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార కేంద్రం అయిన సింగపూర్ కు, పుణ్యక్షేత్రం తిరుపతికి విమానాలు నడిపించారు చంద్రబాబు. సింగపూర్ కు వయబులిటీ ఫండింగ్ ఇచ్చారు. అంటే మినిమమ్ ఆక్యుపెన్సీ లేకపోతే గవర్నమెంటే సాయమందిస్తుంది. అయితే, రెండేళ్లు వయబులిటీ ఫండింగ్ ఇవ్వాల్సి వచ్చిన ఇపుడు ఆకుపెన్సీ పెరిగి ఆ భారం ప్రభుత్వం పడటం లేదు. కానీ జగన్ సర్కారు వచ్చాక చాలా మంది వ్యాపారులు పరిస్థితులు మెరుగుపడ్డాక చూద్దాం లే అని నెమ్మదించారు. దీంతో మళ్లీ ప్రభుత్వం వయబులిటీ ఫండింగ్ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో జగన్ ప్రభుత్వం... ఇపుడు అది మేమెందుకు ఇవ్వాలి అని ఒక చెత్త వాదన తెచ్చింది. దీంతో అన్ని విమానాలు రద్దయ్యాయి.
సింగపూర్ కి నేరుగా విమానం లేని ఒక పెద్ద రాష్ట్ర రాజధానిగా ఇపుడు ఏపీ రికార్డు నెలకొల్పింది. ఇదీ జగన్ జ్జానం, సమర్థత. ఇలాంటి తప్పులు తరచూ జరిగితే ఏపీ ఎన్నటికి ఎదిగేది.
తాజాగా చంద్రబాబు ప్రభుత్వ వ్యవహారాలపై అసెంబ్లీలో మండిపడ్డారు. రాష్ట్రానికి ఏది ఉపయోగమే వీరికి తెలియడం లేదు. చాలా ముందు చూపు ఉండాలి. గతంలో హైదరాబాదు బేగంపేట విమానాశ్రయంలో ఇంధనంపై రీఛార్జి సుంకం తగ్గించడంతో రాకపోకలు పెరిగాయి. విమానాశ్రయం సరిపోలేదు. అప్పటి ప్రధాని వాజ్ పేయిని కొత్త విమానాశ్రయం కోసం అడిగాను. డబ్బులు లేవు అన్నారు. అందుకు రాష్ట్రం తరఫున భూమి సేకరించి ఇచ్చాం. దీంతో అంతర్జాతీయ విమానాశ్రయం మంజూరు చేశారు. ఇపుడు దానివల్ల హైదరాబాదు ఎంతో ఆదాయం సంపాదిస్తోంది అని చంద్రబాబు వివరించారు. భవిష్యత్తును అంచనా వేసి నిర్ణయాలు తీసుకోకపోతే ఏపీ తీవ్రంగా వెనుకపడుతుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తంచేశారు.