ప్రపంచానికి చేతకానిది భారత్ కి చేతనైంది !! 

August 11, 2020
CTYPE html>
ఇండియా బాగుపడితే ప్రపంచ సంపన్న దేశాలకు ఏ మాత్రం నచ్చదు. ఇందుకోసం చేయాల్సిన కుట్రలన్నీ చేస్తాయి. ఇండియా పేద దేశం, మత మౌఢ్య దేశం, పెట్టుబడులకు అనువుగాని దేశం వంటి ఎన్నో ముద్రలు వేస్తుంటుంది ప్రపంచం. 130 కోట్ల జనాభా ఉండి కూడా మనలాంటి బతుకు డబ్బున్న దేశాలు కూడా బతకడం లేదు. 
ప్రపంచంలో అన్ని సర్వేలు, పరిశోధనలు మావే, విశ్లేషణలు మేము ఇస్తాం, రేటింగులు మేమే ఇస్తాం... చివరకు అందాల పోటీలు కూడా మేమే పెడతాం అని విర్రవీగే దేశాలన్నీ యూరప్, ఉత్తమ అమెరికా ఖండపు దేశాలే. కానీ ఇపుడు వారు అక్కడ శవాల గుట్టలు పేర్చుకుంటున్నారు. మనం మాత్రం ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని టీవీలు చూస్తున్నాం.  తమ దగ్గర పరిస్థితి అంత ఘోరంగా ఉన్న విషయం వదిలేసి  UNO (ఇందులో ఆధిపత్య దేశాలు అమెరికా యూరప్ వే) ఇండియాలో కరోనా వల్ల 40 కోట్ల మంది పావర్టీలోకి పోతారు అని లెక్కలు చెబుతోంది. ఒరే మీ సావులు ఒకసారి చూస్కోండిరా అంటూ... మీకు భవిష్యత్తులో చాాలా కష్టం అంటూ లెక్కలు వేస్తున్నాయి. 
మన మీద ఇంత వేగంగా ఇలాంటి దొంగ లెక్కలు కట్టాల్సిన అవసరం వారికి ఏంటి?
కరోనా రాక ముందు ఇండియాలో కరోనా వస్తే... కోట్ల మంది చస్తారు...అని ఎందుకు భయబ్రాంతులకు గురిచేశారు?
చివరకు ఇండియా అంతా ఒక్కతాటిపై నిలిచి దానిని ఎదుర్కొంటే ‘‘కరోనా వైరస్ ఇండియాలో జన్యుమార్పిడి చేసుకుందని‘‘ పనికిమాలిన రిపోర్టులను మన డాక్టర్ల మీద వదుల్తారు?
ఎందుకు వీరికి భారతదేశం గురించి చెప్పడానికి ఎపుడూ పనికిమాలిన విషయాలే గుర్తుకు వస్తాయి? 
దీని వెనుక ఏకంగా కుట్రే ఉంది. ఎలాంటి విపత్తు అయినా తట్టుకునే ఇండియాకు ప్రపంచ గౌరవం దక్కకుండా చేసే కుట్ర. పెట్టుబడులు మళ్లకుండా చేసే కుట్ర. ఒకటా రెండా... ప్రపంచ దేశాలు కట్టగట్టుకుని మనమీద పడిపోతున్నాయి. దీనిని అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని విషయాలు చర్చించుకోవాలి.
ఇండియా జనాభా 130 కోట్లు. అమెరికా జనాభా 35 కోట్లు. వైశాల్యం లో మనదేశం కంటే ఎంతో పెద్దది అమెరికా. ధనవంతుల దేశం. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. ఇంటి ఇంటికి మధ్య దూరం కూడ ఎక్కువ.  ప్రైవసీ ఎక్కువ, శుభ్రత ఎక్కువ. మరి ఇంత డబ్బున్న, జాగ్రత్తలున్న దేశంలో అంత మందికి కరోనా సోకింది. ఇండియాలో కేసులు చాలా పరిమితం. ఏమన్నా మాట్లాడితే మీరు టెస్టులు చేయలేదు అంటారు. సరే... మార్చి 22 నుంచి ఇండియా మూతపడింది. సుమారు 12 రోజులు... మరి జనాలు ఆస్పత్రులకు పోలోమంటూ ఆ లక్షణాలతో అయినా తరలిరావాలి కదా? ప్రపంచంలో అందరినీ ఊపిరాడకుండా చేసిన వ్యాధి టెస్టు చేస్తే గానీ ఇండియన్స్ ఇబ్బంది పెట్టదా? టెస్టులు చేయకపోయినా రోగం ముదిరి అయినా మరణించాలి కదా... మరి అమెరికా ఇటలీ లాగా ఎందుకు ఇక్కడ మారణ హోమం జరగలేదు? ఎందుకంటే ముందు చూపు. 
మరి అగ్రరాజ్యాలకు లేని ముందు చూపు మనకు ఉన్నపుడు మన పేదరికాన్ని ఎదుర్కొనే ముందు చూపు మనకుండదా? 
ఇంత పెద్ద ప్రపంచ విపత్తు వచ్చినపుడు అత్యధికంగా నిరక్షరాస్యులున్న 130 కోట్ల జనాభా ఒక్కతాటిపైకి వచ్చి ప్రపంచాన్ని కబళించిన కరోనాను  ముందు చూపుతో కంట్రోల్ చేసినపుడు మాలో అనన్య సామాన్యమైన ఐక్యత ఉన్నట్టు కాదా? భారతీయుల సమర్థతకు ఇంతకంటే గొప్ప ఉదాహరణలు ఏం కావాలి? 
అసలు ప్రపంచంలో ఏడు ఖండాల్లో పరదేశీయుల దాడిలో అన్ని దేశాల సంస్కృతులు సర్వనాశనం అయ్యాయి. కానీ సుమారు వెయ్యేళ్లు పరదేశీయులు పాలించిన మన దేశం సంస్కృతిని ఇసుమంతైనా పాడుచేయలేకపోయారు. ఇంత సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత కూడా మన సంస్కృతిని సజీవంగా నిలబెట్టుకున్నాం అంటే అంతకంటే గొప్పతనం, సమర్థత ఏముంటుంది? ఇండియా డీఎన్ఏలో అణువణువునా సమర్థత ఉంది. అందుకే మీరు అనుకుంటున్నట్టు ఏ సదుపాయాల్లేని ఈ కాలేజీలు స్కూళ్లలోనే చదువుకుని ప్రపంచంలో పేరొందిన టాప్ కంపెనీలను నడిపించేంతటి తెలివితేటలు ఇండియన్స్ కి ఎలా వచ్చాయి? మా డీఎన్ఏ. అసలు ఇపుడు ఇండియన్ వ్యాపారం చేయని ప్రపంచ దేశం మచ్చుకైనా ఉందా? ఒక్కటీ లేదు. ఏ ఖండంలోను లేదు. 
 
ఉత్తప్రదేశ్, బీహార్, ఢిల్లీ మూడిట్లో ఉన్నంత జనాభా మాత్రమే ఉన్న అమెరికా చేయలేని పని..
ఏపీలో ఉన్నంత జనాభా మాత్రమే కలిగిన ఇటలీ సాధించలేని విజయం...
ఇండియా సాధించింది కదా. ఒక్క ప్రధాని చదువుకున్న వారిని, చదువుకోని వారిని ఒక్కతాటిపైకి తెచ్చి నడిపిస్తున్నారు కదా. 
మా పక్కనే చైనా ఉంది. మీకు దూరంగా చైనా ఉంది. అయినా కరోనా ఉత్పాతాన్ని మాకంటే ముందే పసిగట్టిన మీకు జరిగిన నష్టమేంటి?
ఎపుడో మార్చిలో ఆలస్యంగా మేల్కొన్న మాకు జరిగిన నష్టమేంటి? 
జన్యువు మారింది, బలహీన పడింది వంటి పనికిమాలిన విషయాలు చెప్పకండి...
దేన్నయినా సాధించే శక్తి భారతదేశానికి ఉంది. 
పల్లె, పట్టణం, అడవి, కొండ, గుట్ట తేడా లేకుండా
సింగిల్ డేలో 130 కోట్ల మందికి పోలియో చుక్కలు వేయగలిగిన సత్తా ఉన్న ఈ దేశానికి ఈ కరోనాను ఆపడం పెద్ద విషయం కానే కాదు. 
అలాగే ఎవరెన్ని కుట్రలు చేసినా... భవిష్యత్తులో ప్రపంచ మన్ననలు పొందకుండా ఆపే శక్తి కూడా ఎవరికీ లేదు
మీ కుట్రల మెట్లు ఎక్కుతూ భవిష్యత్తులో ఈ భారత్ వెలిగిపోతుంది ...  !!