జగన్ దేశానికి ఎంత డేంజరో... ఈ ప్రొఫెసర్ చెప్పేశారు

April 03, 2020

నవ్యాంధ్రప్రదేశ్ కు నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న దుందుడుకు చర్యలు ఎంత డేంజరో ఇప్పటికే మనందరికీ అర్థమయ్యింది. అయితే జగన్ చర్యల ద్వారా ఒక్క మన రాష్ట్రానినికే కాకుండా మొత్తం దేశానికే పెద్ద ముప్పు పొంచి ఉందన్న వాదనలు కూడా ఇప్పటికే వినిపించాయి. అయితే ఇప్పటిదాకా ఈ తరహా ప్రమాదాలపై వైసీపీ ప్రత్యర్థి పార్టీలో, జగన్ అంటే గిట్టని వారో చేసినవిగానే తటస్థులు తీసిపారేసిన సందర్భాలు కూడా మనకు తెలిసిందే. అయితే రాజకీయాలతోనే కాకుండా వ్యాపార పరంగా కూడా ఎలాంటి లాభాపేక్ష లేకుండా... భావి భారత పౌరులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పాఠాలు చెప్పుకుంటున్న ఓ ప్రొఫెసర్, అది కూడా లేడీ ప్రొఫెసర్ చేసిన ఓ కామెంట్ ఇప్పుడు.... జగన్ చర్యల ద్వారా ఏ మేర డేంజర్ ఉందన్న విషయం చాలా స్పష్టంగా క్లిస్టర్ క్లియర్ గానే తెలిసి వచ్చింది. 

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి సింగపూర్ ప్రభుత్వంతో చంద్రబాబు హయాంలో కుదిరిన ఒప్పందాన్ని జగన్ సర్కారు రద్దు చేసుకుంది. సింగపూర్ కన్సార్టియానికి బెదిరింపుల తరహా సందేహాలు పంపి మరీ ఆ సంస్థ తనకు తానుగా ఒప్పందం రద్దు చేసుకునేలా జగన్ సర్కారు వ్యవహరించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సింగపూర్ కన్సార్టియ్ ఒప్పందం రద్దుకు ఓకే అనగానే... ముందూ వెనుకా చూడకుండా జగన్ సర్కారు ఓకే చెప్పేసింది. అంతేకాకుండా ఈ ఒప్పందం రద్దు ఇరు వర్గాల ఉమ్మడి అంగీకారంతోనే జరిగిందని కూడా సింగపూర్ కన్సార్టియం చెప్పడం గమనార్హం. మొత్తంగా అమరావతి అభివృద్ధికి సంబంధించిన కీలక ఒప్పందం రద్దైపోయింది.

ఈ వ్యవహారంపై లోకల్ మీడియాతో పాటుగా జాతీయ మీడియా కూడా పెద్ద ఎత్తున కథనాలను ప్రముఖంగానే ప్రచురించాయి. ఆ కథనాల్లో ఒకటైన బిజినెస్ స్టాండర్డ్ పత్రిక కథనాన్ని చదివిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ప్రొఫెసర్ గానే కాకుండా బ్రూకింగ్స్ ఇండియా డైరెక్టర్ గానూ వ్యవహరిస్తున్న ప్రముఖ ఎకానమిస్ట్ షమికా రవి ఆసక్తికర కామెంట్ చేశారు. చూడ్డానికి సింగిల్ కామెంటే అయినా కూడా... తన కామెంట్ లో ఆమె... జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఒక్క ఏపీకే కాకుండా యావత్తు దేశానికి ఎంతమేర ప్రమాదం ఉందన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పేశారు. ‘ఇమాజిన్.. వాట్ దిస్ విల్ డూ టూ క్రెడిబిలిటీ ఆప్ కాంట్రాక్ట్స్ (విచ్ ఈజ్ ఆల్రెడీ పూర్) ఇన్ ఇండియా’ అని ఆమె చేసిన కామెంట్ నిజంగానే ఆందోళన రేకెత్తించేదే. కేవలం చంద్రబాబు  క్రెడిబిలిటీని దెబ్బ తీసే క్రమంలో జగన్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఏకంగా దేశ క్రెడిబిలిటీకే ముప్పుగా పరిణమించిన వైనం ప్రొఫెసర్ షమికా రవి కామెంట్ లో చాలా స్పష్టంగానే తెలుస్తోంది. అంతేకాకుండా జగన్ తీసుకుంటున్న ఈ తరహా దుందుడుకు నిర్ణయాలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించకపోతే కొంప కొల్లేరవడం ఖాయమేనన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.