జగన్ కొత్త వ్యూహం - ఫిరాయింపులుండవు, కానీ

August 07, 2020

ముఖ్యమంత్రి అయ్యాక శాసన సభ తొలి సమావేశాల్లోనే ఫిరాయింపులు ఉండవు అని జగన్... ప్రకటించారు. జగన్ ప్లాన్స్ తెలియని కొందరు శభాష్ సీఎం అన్నారు. కానీ జగన్ ఉద్దేశం, రాజకీయం వేరు. కక్షపూరిత రాజకీయాల కోసం ఆయన ఎన్ని వ్యూహాలైనా పన్నుతారు. ప్రజలకు పాదయాత్రలో వెయ్యి హామీలిచ్చి, వాటిని పేపర్లలో గోడమీద రాతల్లో బాగా ప్రజల్లోకి పంపి... ఎన్నికలకు వారం పది రోజుల ముందు మాత్రమే ఇచ్చిన హామీల్లో కొన్ని మాత్రమే పెట్టారు. ఎందుకు మాట తప్పారు అంటే మేం మాట తప్పలేదు కావాలంటే మ్యానిఫెస్టో చూసుకోండి అంటారు. స్వయానా తనే పాదయాత్రలో చెబితే అది లెక్కలోకి రాదట, మ్యానిఫెస్టోలోనిదే లెక్కలోకి తీసుకోవాలట. ఇదీ జగన్ వ్యూహరచన. 

తాజాగా తెలుగుదేశంపై దాడికి మరోపథక రచన చేశారు. టీడీపీ సభ్యులను భయపెట్టి చంద్రబాబును ఒంటరిని చేసేందుకు జగన్ వ్యూహం పన్నారని మీడియా కోడై కూస్తోంది. ఫిరాయింపులు నిజంగానే ఉండవు. వేరే పార్టీ వారిని వైసీపీలో చేర్చుకోరు. కానీ వారు ఆయా పార్టీల్లోనూ ఉండరు. స్వతంత్ర ఎమ్మెల్యేలుగా మిగిలిపోయేలా ప్రణాళిక. అంటే జగన్ చేతికి మట్టి అంటకుండానే జగన్ లక్ష్యం నెరవేరుతుందన్నమాట. ఆర్కే వివరించిన ఆ వ్యూహం ఏంటో మీరే వినండి.