ఏపీ మంత్రి గారి అతి తెలివి... దాని వెనుక భాగోతం ఇది

February 24, 2020

ఈ కాలానికి కరెక్టు నాయకుడు జగన్ రెడ్డి.

ఎందుకో తెలుసా... ఈ కాలం జనాలు తమకు లాభాలను ఇచ్చే పనులకు మాత్రమే బుర్రలు వాడి ఆలోచిస్తారు.

తమకు లాభసాటి కానిది ఇతర ఏ విషయం అయినా సరే... ‘‘ఓ అవునా’’ అని గుడ్డిగా ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తారు. 

ఈ కాలం జనాలను కరెక్టుగా అంచనా వేసిన జగన్... చాలా సులువుగా అధికార పీఠం ఎక్కారు. తాను కష్టపడ్డాను అని జనాల్ని భ్రమింపజేశాడు. తాము అద్భుతంగా పనిచేస్తున్నామని అంతే తెలివిగా జనాలను నమ్మించగలుగుతున్నాడు. దానికి తాజా ఉదాహరణ ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పీపీఏలపై కేంద్రానికి రాసిన లేఖ. ఈ లేఖ చదివిన వారికి... అబ్బ జగన్ రెడ్డి, ఆయన టీం... ఏపీ సంక్షేమం కోసమే పుట్టారు, ఏపీ డబ్బులు మిగల్చడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు అనిపిస్తుంది. ముందు బాలినేని కేంద్రానికి రాసిన లేఖ సారాంశం ఇక్కడ చదవండి. తర్వాత... అందులో మతలబు ఏంటో, మనం బుర్ర పెట్టి ఆలోచించాల్సినది ఏంటో మీకు చెబుదాం.

బాలినేని లేఖ ...

సౌర, పవన విద్యుత్ వల్ల యూనిట్‌కు రూ.3.55ల (అడక్వెసీ కాస్ట్‌ రూ. 2.5, బాలెన్సింగ్‌ కాస్ట్‌ రూ. 1.05, గ్రిడ్‌ గ్రిడ్‌ అనుసంధాన ఖర్చు రూ. 0.25లు) భారం పడుతోంది. విద్యుత్ రంగంలో ప్రస్తుతం ఉన్న సంక్షోభాన్ని అధిగమించడానికి విద్యుత్‌ సరఫరా కంపెనీలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి సోలార్‌, విండ్‌ పవర్‌ల కంపెనీలతో నిరంతరాయంగా చర్చలు జరుపుతోందని, తగిన పరిష్కారమార్గాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. వీటి వల్ల ఏటా ఏపీపై 5 వేల కోట్ల భారం పడుతోంది. ఏపీ పంపిణీ సంస్థలు (రెండున్నాయి) దేశంలో అతితక్కువ విద్యుత్ పంపిణీ నష్టాలు నమోదుచేసి రికార్డు సృష్టించినా ఈ పీపీఏల భారం వల్ల నష్టాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో 60 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంటే.. 15 వేల మి.యూ. పవన సౌర విద్యుత్ ద్వారానే ఉత్పత్తి అవుతోంది. ఈ సంక్షోభానికి పరిష్కారం చూపేందుకు కేంద్ర, రాష్ట్ర ఇంధన శాఖ ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వ ఆర్థిక ప్రతినిధితో కలిపి కమిటీ వేయండి.  

 

వాస్తవాలు..

దేశంలో అనేక రాష్ట్రాలు 5 రూపాయలు పెట్టి విద్యుత్ కొంటుంటే.. ఏపీకి 3.55 కే ఎలా వస్తోంది?

కారణం... చంద్రబాబు హయాంలో సౌర, పవన విద్యుత్ కంపెనీలను ప్రోత్సహించడం మూలంగా భారీ సంఖ్యలో అతిపెద్ద కంపెనీలు వేల కోట్లు పెట్టుబడి పెట్టి రాయలసీమ ఈ ప్లాంట్లు ఏర్పాటుచేశాయి. దీంతో కొరత లేకుండా విద్యుత్ పుడుతోంది. అందుకే మిగతా రాష్ట్రాల కంటే తక్కువకు ఏపీకి విద్యుత్ దొరుకుతోంది. అంటే... గత ప్రభుత్వం వీటిని ప్రోత్సహించకపోతే 15 వేల మిలియన్ యూనిట్ల ఉత్పత్తి మన వద్ద ఉండేది కాదు. దీంతో విద్యుత్ కు డిమాండ్ పెరిగి 7 రూపాయలు పైగా డబ్బులు పెట్టాల్సి వచ్చేది. ముందుచూపు వల్ల ఇదంతా మిగిలింది.

దేశంలోనే అతితక్కువ విద్యుత్ సరఫరా నష్టం నమోదు చేస్తున్న ఏపీ ! ఎలా సాధ్యం?

రాష్ట్రం విడిపోయాక ఏపీ మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన మొన్ననే దిగిపోయారు. అంటే ఐదేళ్లలో విద్యుత్ సరఫరా నష్టాలను చంద్రబాబు విపరీతంగా తగ్గించారని బాలినేని లిఖిత పూర్వకంగా అంగీకరించారు. అధికారంలోకి వచ్చాక ప్రతిరోజు చంద్రబాబు ఒక యూనిట్ పొదుపు రెండు యూనిట్ల ఉత్పత్తితో సమానం అని చెవులో జోరీగలా మారేవాడు. ఆ క్రమంలో పంపిణీ నష్టాల తగ్గింపునకు అనేక చర్యలు తీసుకున్నారు.

15 వేల మిలియిన్ యూనిట్ల పవన, సౌర విద్యుత్తును ఏపీ ఉత్పత్తి చేస్తోంది! ఎలా?

అంటే... కనీసం లక్ష మందికి పైగా వీటి వల్ల ఉద్యోగాలు వచ్చిన మాట నిజమని జగన్ టీంలో మంత్రి ఒప్పుకున్నాడు. లక్ష మంది సిబ్బంది వివిధ దశల్లో లేకపోతే .. ఇంత విద్యుదుత్పత్తి జరగదు. అవునా కాదా?

నిపుణుల కమిటీకి వైకాపా మంత్రి డిమాండ్ ! ఎందుకంటే...

ఏపీ సర్కారు మేమే సమీక్షిస్తాం అని ప్రకటించి కేంద్రంతో తిట్లుతినింది. ఇంకో అడుగు ముందుకేసినా మోడీ వాయిస్తాడు. వెనకడుగు వేస్తే పరువు పోతుంది. అందుకే క్రెడిట్ కేంద్రానికి ఇవ్వడానికి కేంద్రాన్నే నిపుణుల కమిటీ వేయమని వైకాపా కోరుతోంది. దీనివల్ల బీజేపీ టీడీపీ వైరాన్ని మరింత పెంచడం, క్రెడిట్ బీజేపీకి పోయినా.. చంద్రబాబు పరువు తీసే అవకాశం దొరుకుతుందేమో అన్న ఆశ ఈ లేఖ రాయడానికి కారణం. వాస్తవానికి బాలినేని రాసిన లేఖలో ప్రతి అక్షరం చంద్రబాబు సమర్థతను నిరూపిస్తోంది. కానీ... ముందే చెప్పుకున్నట్లు తమకు ఉపయోగం లేని విషయాల గురించి మన జనం బుర్రవాడరు అని కనిపెట్టిన జగన్ పైకి.. తమదే మంచి ప్రభుత్వం అని క్రెడిట్ కొట్టేయడానికి విఫలయత్నం చేస్తోంది.