జగన్ జమానా... దోపిడీకి రెడ్లు, సేవకు నాన్ రెడ్లు

June 03, 2020

నవ్యాంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలి కొత్త తరహా పాలనకు శ్రీకారం చుట్టిన వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. తాను సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే సీఎంఓతో పాటు ఇతర కీలక విభాగాల్లో తన సొంత సామాజిక వర్గానికి చెందిన రెడ్లను నియమించుకున్న జగన్... ప్రకృతి విపత్తులు, ఆపదలో ఉన్న ప్రజలకు సేవలు అందించేందుకు మాత్రం తన సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించకుండా... ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారిని నియమిస్తున్నారు. ఈ తరహా పాలన, ప్రజా సేవలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని రీతిలో జగన్ కొత్త తరహా పాలనకు శ్రీకారం చుట్టారన్న వాదనలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇందుకు నిలువెత్తు నిదర్శనాలు కూడా జగన్ పాలనలో కోకొల్లలుగానే కనిపిస్తున్నాయి. 

అలా నిలుస్తున్న తాజా ఉదాహరణను చూద్దాం పదండి. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగా అత్యవసర సేవల విభాగాలను రంగంలోకి దింపిన జగన్ సర్కారు.... వాటిని సమన్వయం చేసేందుకు జిల్లాకు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమిస్తూ శుక్రవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ జాబితాలతో ఒక్కరంటే ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి కూడా లేరు. ఆ జాబితాలో శ్రీకాకుళం - ఎంఎం నాయక్, విజయనగరం - వివేక్ యాదవ్, విశాఖ - కాటంనేని భాస్కర్, తూర్పు గోదావరి - బి.రాజశేఖర్, పశ్చిమగోదావరి - ప్రవీణ్ కుమార్, కృష్ణా - సిద్దార్థ్ జైన్, గుంటూరు - కాంతిలాల్ దండే, ప్రకాశం - ఉదయ లక్ష్మి, నెల్లూరు - బి.శ్రీధర్, కర్నూలు - పీయూష్ కుమార్, కడప - శశిభూషణ్ కుమార్, అనంతపురం - భాస్కరరావు నాయుడు, చిత్తూరు - రాంగోపాల్ తదితరులున్నారు. వీరిలో ఒక్కరంటే ఒక్కరు కూడా జగన్ సామాజిక వర్గానికి చెందిన అధికారి గానీ, జగన్ కు అత్యంత దగ్గరి అధికారులుగా పేరున్న వారు గానీ లేరు. 

ఆపద సమయాల్లో సేవలందించే బృందాల్లో తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను నియమించకుండా వ్యవహరించిన జగన్... తన వారిని ప్రకృతి విపత్తుల్లో చిక్కుకోకుండా జాగ్రత్త పడ్డారన్నట్లే కదా. ఇదే విషయంపై ఇప్పుడు రాష్ట్రంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తన వద్ద, తన కార్యాలయంలో, పాలనలో కీలక శాఖల్లో తన సొంత సామాజిక వర్గానికి చెందిన అధికారులను నియమించుకున్న జగన్... వారిని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండానే ప్రజా సేవలకు మాత్రం ఇతర సామాజిక వర్గాలకు చెందిన అధికారులను పంపుతుండటంపై ఆయా వర్గాల అధికారులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కీలక శాఖల బాధ్యతలు మాత్రం తన సొంత వారికి కట్టబెట్టుకున్న జగన్... తమను మాత్రం ప్రజా సేవ పేరిట ప్రమాదకరమైన పరిస్థితుల్లో విధులు నిర్వర్తించేందుకు పంపుతున్నారని ఆయా సామాజిక వర్గాల అదికారులు ఆరోపిస్తున్నారు. 

ఇక్కడ మరో అంశం కూడా ఆసక్తి రేపుతోంది. ఈ తరహా చర్యల ద్వారా తమ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అధికారులు గానీ, నేతలు గానీ కీలకమైన ప్రజా సేవలకు పనికి రారని జగన్ తనకు తాను రూలింగ్ ఇచ్చుకున్నట్లు అయ్యిందన్న వాదనలు వినిపిఃస్తున్నాయి. అంతేకాకుండా ప్రజా ధనాన్ని వాటాలు వేసుకుని పంచుకోవడానికి మాత్రమే తన సామాజిక వర్గం పనికి వస్తుందని, ప్రకృతి విపత్తుల వేళ జనానికి బాసటగా నిలిచేందుకు మాత్రం తమ రెడ్లు ఎంతమాత్రం పనికి రారని, ఈ విషయంలో రెడ్లంతా దద్దమ్మలేనని జగనే ఒప్పుకున్నట్టు అయ్యిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలా కాకుండా తాను సీఎం కాగానే.... తన సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారిని ఏరికోరి తన కార్యాలయంలో కార్యదర్శిగా నియమించుకున్న జగన్... మరి ఈ విపత్తుల వేళ కూడా ముందుగా తన సొంత సామాజిక వర్గానిక ిచెందన అధికారికే కీలక బాధ్యతలు అప్పగించవచ్చు కదా అన్న వాదనలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.